కోట్లు ఇస‍్తామన్నా రిజెక్ట్‌ చేశా.. హీరో | GV Prakash Kumar Says No Cool Drink Ad | Sakshi
Sakshi News home page

GV Prakash Kumar: అలాంటివి నాకు నచ్చవు, అందుకే కోట్లు ఆఫర్‌ చేసినా..

Feb 10 2024 2:16 PM | Updated on Feb 10 2024 2:48 PM

GV Prakash Kumar Says No Cool Drink Ad - Sakshi

శీతల పానీయాలు, జూదాట్టం వంటి సంస్థల ప్రకటనల్లో నటించడానికి కోట్లు ఇస్తానంటున్నారని, అయినా తాను వాటిలో నటించడానికి అంగీకరించడం లేదని బ్యాడ్మింటన్‌ వం

చల్లని పానీయాల ప్రకటనల్లో నటించడానికి కోట్లు ఇస్తానన్నా తాను అంగీకరించడం లేదని నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు జీవీ ప్రకాష్‌కుమార్‌ తెలిపారు. సినీ రంగంలో ప్రతిభను ప్రోత్సహించే విధంగా నరేష్‌ బృందం స్టార్డా అనే సరికొత్త ప్లాట్‌ఫామ్‌ ప్రారంభించింది. దీనికి జీవీ ప్రకాష్‌కుమార్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. గురువారం సాయంత్రం చైన్నెలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవీ మాట్లాడుతూ.. తాను చిన్నతనంలోనే చిత్ర రంగ ప్రవేశం చేశానన్నారు.

హీరోగా 23 సినిమాలు చేశా
పలు చిత్రాలకు సంగీతాన్ని అందించానని, అదే విధంగా కథానాయకుడిగా 23 చిత్రాలు చేశానన్నారు. వెట్రిమారన్‌, ఏఎల్‌ విజయ్‌, అట్లీ వంటి పలువురు దర్శకులతో తొలి రోజుల్లో తాను పనిచేసినట్లు చెప్పారు. పనిచేసిన దర్శకుల్లో 17 మంది కొత్త వారేనన్నారు. ఇక్కడ ప్రతిభకు కొరత లేదని, అయితే దానిని ప్రదర్శించడానికి సరైన మార్గం చాలా మందికి తెలియడం లేదన్నారు. ఇలాంటి వారికి ఈ స్టార్డా మంచి ప్లాట్‌ఫామ్‌ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

జూదం, కూల్‌ డ్రింక్స్‌.. నో!
ఈ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసిన నరేష్‌ బృందాన్ని అభినందిస్తున్నానన్నారు. శీతల పానీయాలు, జూదం ఆడటం వంటి సంస్థల ప్రకటనల్లో నటించడానికి కోట్లు ఇస్తానంటున్నారని, అయినా తాను వాటిలో నటించడానికి అంగీకరించడం లేదన్నారు. ఈ స్టార్డా ప్లాట్‌ఫామ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉందని జీవీ ప్రకాష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

చదవండి: వాలంటైన్స్​ డే స్పెషల్.. 9 సూపర్‌ హిట్‌ చిత్రాలు రీ రిలీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement