వాలైంటైన్స్​ డే స్పెషల్.. 9 సూపర్‌ హిట్‌ చిత్రాలు రీ రిలీజ్‌ | Sakshi
Sakshi News home page

వాలైంటైన్స్​ డే స్పెషల్.. 9 సూపర్‌ హిట్‌ చిత్రాలు రీ రిలీజ్‌

Published Sat, Feb 10 2024 10:37 AM

Valentines Day 2024 Re Release Movies List - Sakshi

ప్రేమికుల రోజు రానుంది. ఈ రోజును ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలని ఇప్పటికే ప్లాన్స్‌ వేసే ఉంటారు. తన ప్రియురాలు/ ప్రియుడికి ఎలాంటి కానుకలు ఇవ్వాలని ఆలోచించే ఉంటారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారు మొదట ఎక్కడ కలుసుకున్నారో ఆ నాటి స్మృతులను మరోసారి గుర్తుచేసుకుంటారు. ప్రేమించేవారిని ఎలా సర్‌ప్రైజ్‌ చేయాలో నిర్ణయానికి వచ్చి ఉంటారు. వాట్సప్‌ డీపీగా ఏ ఫొటో పెట్టాలో... ఫేస్‌బుక్‌ పేజీలో ఏ కవిత పోస్ట్‌ చేయాలో... ఇన్‌స్టాగ్రాంలో ఏ చిత్రం పంచుకోవాలో.. సిద్ధంగా ఉంచుకునే ఉంటారు.

ఇలా చాలా మంది ప్రేమికులకు సినిమా అనేది ఒక భాగం. అందుకే ప్రేమ గురించి గతంలో లెక్కలేనన్ని సినిమాలు వచ్చేశాయి. అలా ప్రేమికులను మెప్పించిన ఆ సినిమాలు మళ్లీ రీరిలీజ్‌ అవుతున్నాయి. వాలెంటైన్స్ డే నాడు వచ్చే చిత్రాలు ఏంటో చూద్దాం.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, గౌతమ్​ వాసుదేవ్ మేనన్​ కాంబినేషన్‌లో 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' చిత్రం విడుదలై సూపర్‌ హిట్‌ కొట్టింది. 2008లో విడుదలైన ఈ సినిమా గతేడాదిలోనే రీ రిలిజ్‌ అయి భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. ఇప్పుడు ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల అవుతుంది. ఇందులో హీరో సూర్య డ్యుయల్ రోల్‌లో మెప్పించాడు. హ్యారీస్ జైరాజ్ సంగీతం ఈ మూవీకి పెద్ద ప్లస్ అయింది.

సిద్ధార్థ్ ప్రేమ కథా చిత్రాల్లో 'ఓయ్‌' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో షామిలీ హీరోయిన్‌గా అద్భుతంగా నటించింది. ఈ సినిమా 2009లో రిలీజ్ అయి మంచి లవ్ స్టోరీగా మిగిలిపోయింది. సుమారు 15 ఏళ్ల తర్వాత వాలెంటైన్స్ డే సందర్భంగా  ఫిబ్రవరి 14న థియేటర్‌లలోకి మరోసారి వచ్చేస్తుంది. ఈ సినిమా కోసం యూత్‌ బాగానే ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం సీతారామం. 2022లో వచ్చిన ఈ సినిమాలో దుల్కర్  సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఎమోషనల్ లవ్ స్టోరీతో ఆకట్టుకుంది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా క్లాసికల్‌ హిట్‌గా నిలిచింది. వాలెంటైన్స్ డే సందర్భంగా  ఫిబ్రవరి 14న థియేటర్‌లలోకి మరోసారి వచ్చేస్తుంది.

1998లో బ్లాక్​బస్టర్ అందుకున్న తొలిప్రేమ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం ప్రేమికుల మనసులను గెలుచుకొని బ్లాక్‍బాస్టర్ అయింది. ఒక రకంగా పవన్‌కు ఈ చిత్రం స్టార్‌డమ్‌ను కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఇప్పటికే గతంలో రీ రిలీజ్‌ కావడంతో ఇప్పుడు తక్కువ సంఖ్యలో మాత్రమే థియేటర్‌లలోకి రానుంది.

అలానే ఈ చిత్రాలతో పాటు సిద్ధార్​, త్రిష జంటగా నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', పన్నెండేళ్ల క్రితం శర్వానంద్, అంజలి జై కాంబినేషన్​లో వచ్చిన 'జర్నీ' సినిమా కూడా రీ రిలీజ్ కానున్నాయి. తెలుగులోనే కాకుండా బాలీవుడ్​లోనూ పలు ప్రేమ కథా చిత్రాలు రీ రిలీజ్‌ కానున్నాయి.  దిల్​వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్ తో పాగల్ హై', మొహబ్బతే వంటి హిట్‌ సినిమాలు కూడా రానున్నాయి. ఈ వాలెంటైన్స్ డే నాడు సినిమా అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement