Oye
-
మరోసారి...
తెలుగు పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ సాగుతోంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు. ఆయా హీరోల అభిమానులు, ప్రేక్షకులు కూడా వన్స్ మోర్ అంటూ ఆ సినిమాలను మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే గత చిత్రాలను 4కె క్వాలిటీతో సరికొత్తగా అందిస్తుండటంతో ప్రేక్షకులు కూడా సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’, మహేశ్‌బాబు ‘అతిథి’, ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా, ఊసరవెల్లి’, రవితేజ ‘కృష్ణ’, సిద్ధార్థ్ ‘ఓయ్’, శింబు ‘వల్లభ’ వంటి అరడజను పైగా సినిమాలు రీ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఆయా చిత్రాల వివరాలేంటో ఓ లుక్ వేద్దాం... పద్దెనిమిదేళ్ల తర్వాత... హీరో రవితేజ ఈ వేసవిలో థియేటర్లలో ప్రేక్షకులకు నవ్వులు పంచనున్నారు. ఆయన హీరోగా నటించిన ‘కృష్ణ’ చిత్రం మే నెలలో రీ రిలీజ్ కానుంది. రవితేజ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన సినిమా ‘కృష్ణ’. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా నటించారు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ముకుల్ దేవ్, గిరిబాబు, చంద్రమోహన్, సుధ, వేణు మాధవ్, సునీల్, జయప్రకాశ్ రెడ్డి, షాయాజీ శిండే, సత్యం రాజేశ్ ఇతర పాత్రలు పోషించారు. నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ విజువల్స్‌పై బి. కాశీ విశ్వనాథం నిర్మించారు.రవితేజ మాస్ ఇమేజ్, వినాయక్ మాస్ క్రేజ్ ఈ మూవీకి ప్లస్ అయింది. రవితేజ, త్రిష, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్‌ని కడుపుబ్బా నవ్వించాయి. 2008 సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. చక్రి అందించిన సంగీతం ఈ మూవీ విజయంలో తన వంతు పాత్ర పోషించింది అనడం అతిశయోక్తి కాదు. మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా రవితేజ కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. పద్దెనిమిదేళ్ల తర్వాత మే 8న ‘కృష్ణ’ మూవీ రీ రిలీజ్ అవుతోంది.ఇదిలా ఉంటే... రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. దేవుడా... ‘రేసు గుర్రం’ సినిమాలో దేవుడా అంటూ ఓ మేనరిజమ్‌తో హీరో అల్లు అర్జున్ పలికిన డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. మరోసారి ఆ మేనరిజాన్ని ప్రేక్షకులు చూడనున్నారు. అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘రేసు గుర్రం’. ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. బ్రహ్మానందం, ప్రకాశ్‌రాజ్, అలీ, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, రవి కిషన్, శ్యామ్, పవిత్రా లోకేష్, ప్రగతి ఇతర పాత్రలు పోషించారు. బేబి భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ్రపొడక్షన్స్పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వెంకటేశ్వ రావు నిర్మించారు.మాస్, యాక్షన్ , కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా 2014 ఏప్రిల్ 11న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రత్యేకించి అల్లు అర్జున్–శ్రుతీహాసన్ ఎనర్జిటిక్ డ్యాన్సులు ప్రేక్షకులకు కనువిందు కలిగించాయి. అల్లు అర్జున్ ఎనర్జిటిక్ యాక్టింగ్, శ్రుతీహాసన్ అమాయకత్వం ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. తమన్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇన్స్పెక్టర్ కిల్‌బిల్ పాండేగా బ్రహ్మానందం ఏ స్థాయిలో ఆడియన్స్‌కి నవ్వులు పంచారో తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘రేసు గుర్రం’ మూవీని ఆయన పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న రీ రిలీజ్ చేస్తున్నారు. క్రౌన్ మూవీస్ ద్వారా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ని కూడా విడుదల చేశారు.తమ అభిమాన హీరో (అల్లు అర్జున్) పుట్టినరోజు అయిన ఏప్రిల్ 8న ‘రేసు గుర్రం’ రీ రిలీజ్ అవుతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే... ‘పుష్ప: ది రైజ్’ (2021), ‘పుష్ప 2: ది రూల్’ (2024) సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏఏ 22’ (వర్కింగ్ టైటిల్). తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అతిథి వస్తున్నాడు ఈ వేసవికి మహేశ్ బాబు ‘అతిథి’ గా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తున్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అతిథి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృతా రావ్ హీరోయిన్గా నటించారు. కోట శ్రీనివాసరావు, నాజర్, మురళీ శర్మ, ఆశిష్ విద్యార్థి, అజయ్, వేణుమాధవ్, రాజీవ్ కనకాల, ప్రగతి ఇతర పాత్రలు పోషించారు. ఘట్టమనేని రమేశ్ బాబు, రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 2007 అక్టోబరు 18న విడుదలైంది. మహేశ్ బాబు మేకోవర్, స్టైలిష్ లుక్స్, యాక్షన్... వంటివన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహేశ్ బాబును దర్శకుడు సురేందర్ రెడ్డి అల్ట్రా మోడ్రన్ లుక్‌లో ప్రజెంట్ చేశారు. లాంగ్ హెయిర్, ట్రెండీ కాస్ట్యూమ్స్, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో మహేశ్ బాబు ప్రేక్షకులను కట్టిపడేశారు.ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ ఘట్టాలు, సురేందర్ రెడ్డి మార్క్ టేకింగ్ చాలా కొత్తగా అనిపించాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం ‘అతిథి’ సినిమాకు అతి పెద్ద బలం అని చెపొ్పచ్చు. అదే విధంగా మహేశ్ బాబు–అమృతా రావ్ మధ్య సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ సినిమాను 4కె వెర్షన్న్లో రీ రిలీజ్ చేస్తుండటంతో అటు అభిమానుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ ఫుల్ క్రేజ్ నెలకొంది. మే 31 సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని మే 29న ‘అతిథి’ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో, మెరుగైన సౌండ్ క్వాలిటీతో వస్తున్న ‘అతిథి’ని చూసేందుకు ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా మహేశ్ బాబు హీరోగా నటించిన ‘పోకిరి’, ‘ఒక్కడు’, ‘బిజినెస్ మేన్’, ‘మురారి’ వంటి చిత్రాలు ఇప్పటికే రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ‘వారణాసి’ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేకమైన వారణాసి సెట్లో జరుగుతోంది. 2027 ఏప్రిల్ 9న విడుదల కానున్న ‘వారణాసి’పై అంతర్జాతీయ స్థాయిలో ఫుల్ బజ్ నెలకొంది. డబుల్ ధమాకా హీరో ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా తన అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటించిన ‘ఆంధ్రావాలా’, ‘ఊసరవెల్లి’ సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘ఆంధ్రావాలా’. ఈ మూవీలో రక్షిత హీరోయిన్గా నటించారు. రమాప్రభ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, వేణుమాధవ్, షాయాజీ శిండే, రాహుల్ దేవ్, బెనర్జీ, నాజర్, సంఘవి ఇతర పాత్రలు పోషించారు.భారతి సమర్పణలో గిరి నిర్మించిన ఈ సినిమా 2004 జనవరి 1న విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారి తండ్రీకొడుకుగా ద్విపాత్రాభినయం చేశారు. చక్రి అందించిన సంగీతం ఈ మూవీకి ప్లస్ అయింది. ఎన్టీఆర్, రక్షిత డ్యాన్స్‌లు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రం విడుదలై 22 ఏళ్లు దాటిపోయింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘ఆంధ్రావాలా’ని రీ రిలీజ్ చేస్తున్నారు నిర్మాత గిరి. ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఊసరవెల్లి’. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించారు. ప్రకాశ్‌రాజ్, తనికెళ్ల భరణి, విద్యుత్ జమాల్, షాయాజీ శిండే, మురళీ శర్మ, ప్రభాస్ శ్రీను, జీవీ సుధాకర్ నాయుడు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 2011 అక్టోబరు 6న రిలీజ్ అయింది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో సంగీతం అందించారు. సుమారు పదిహేనేళ్ల తర్వాత ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధం అవుతోంది.మే 20న ఎన్టీఆర్ బర్త్ డేని పురస్కరించుకుని ఈ సినిమా రీ రిలీజ్‌కి ముస్తాబవుతోంది. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్‌నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ . మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేసవిలో ఓయ్ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (2005) సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు హీరో సిద్ధార్థ్. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారాయన. ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’ (2006) మూవీతో సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రాల్లో ‘ఓయ్’ ఒకటి. ఆనంద్రంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షామిలి హీరోయిన్గా నటించారు.సునీల్, అలీ, కృష్ణుడు, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ల భరణి, ప్రదీప్ రావత్, నెపోలియన్ తదితరులు నటించారు. డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మించారు. 2009 జూలై 3న విడుదలైన ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ప్రత్యేకించి యువన్ శంకర్ రాజా సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అయింది. మ్యూజిక్ పరంగా ఈ మూవీ హిట్ అయ్యింది. మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ‘ఓయ్’ ఏప్రిల్ 17న రీ రిలీజ్ అవుతోంది. తెలుగులో ఆ మధ్య వరుస సినిమాలు చేసిన సిద్ధార్థ్ ప్రస్తుతం తమిళంలో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నారు. వల్లభ సిద్ధం శింబు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘వల్లవన్’. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటించగా, రీమా సేన్, సంధ్య, సంతానం, ప్రేమ్‌జీ, సత్యన్ ప్రధాన పాత్రలు పోషించారు. పీఎల్ తేనప్పన్ నిర్మించిన ఈ మూవీ తమిళంలో 2026 అక్టోబరు 21న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వల్లభ’ పేరుతో అనువదించి, రిలీజ్ చేశారు. 2006 నంబరు 11న తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఇక్కడ కూడా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నయనతార టీచర్‌గా, శింబు స్టూడెంట్‌గా నటించారు. టీచర్–స్టూడెంట్ మధ్య ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ప్రత్యేకించి యువతని భారీగా ఈ మూవీ థియేటర్లకు రప్పించింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ప్రత్యేకంగా నిలిచింది. కళాశాల ప్రేమకథ నేపథ్యంలో రూపొందిన ‘వల్లభ’ సినిమా మే 9న విడుదలవుతోంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా రీ రిలీజ్‌కి ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
Oy! Re Release: థియేటర్లో యువతి మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్
ప్రస్తుతం టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ప్రతి నెల నాలుగైదు పాత సినిమాలను మళ్లీ ఒక్కరోజు థియేటర్స్‌లో ప్రదర్శిస్తున్నారు. అయితే మొన్నటి వరకు కేవలం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే రీరిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు గతంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలన్నీ మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు. ప్రేమికుల రోజు ఏకంగా 9 సినిమాలను రీరిలీజ్ అయ్యాయి. అయితే వాటిల్లో ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అయిన మూవీ ఓయ్. సిద్ధార్థ్, షామిలీ హీరోయిన్లుగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం 2009లో రిలీజైంది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. కానీ టీవీల్లోకి వచ్చిన తర్వాత విశేష ప్రేక్షకాదరణ పొందింది. ముఖ్యంగా యువత ఈ చిత్రాన్ని బాగా ఆదరించింది. అందుకే ప్రేమికుల రోజు ఈ మూవీని మళ్లీ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు థియేటర్ లో ఓయ్ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు. దానికి ఈ వీడియోనే నిదర్శనం. రీరిలీజ్‌లో భాగంగా నిన్న వైజాగ్‌లోని ఓ థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ మూవీ చూసేందుకు వచ్చిన ఓ అమ్మాయి.. తన డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. ఎల్లో శారీలో వచ్చిన ఆ యువతి.. ఓయ్ సినిమాలోని ప్రతి పాటకు ఊర మాస్ స్టెప్పులేసి ఆకట్టుకుంది. హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా స్టెప్పులేస్తూ..అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. Finally lengthy video mikosam🌝 🤌 rampp asalu dance 🥵❤️#OyeReRelease #OyeMovie Thanks for the movie @AnandRanga 💥 pic.twitter.com/DEBKaMC3WV — Iconboy (@bunny_tweetz) February 14, 2024 -
వాలైంటైన్స్ డే స్పెషల్.. 9 సూపర్ హిట్ చిత్రాలు రీ రిలీజ్
ప్రేమికుల రోజు రానుంది. ఈ రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఇప్పటికే ప్లాన్స్ వేసే ఉంటారు. తన ప్రియురాలు/ ప్రియుడికి ఎలాంటి కానుకలు ఇవ్వాలని ఆలోచించే ఉంటారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారు మొదట ఎక్కడ కలుసుకున్నారో ఆ నాటి స్మృతులను మరోసారి గుర్తుచేసుకుంటారు. ప్రేమించేవారిని ఎలా సర్ప్రైజ్ చేయాలో నిర్ణయానికి వచ్చి ఉంటారు. వాట్సప్ డీపీగా ఏ ఫొటో పెట్టాలో... ఫేస్బుక్ పేజీలో ఏ కవిత పోస్ట్ చేయాలో... ఇన్‌స్టాగ్రాంలో ఏ చిత్రం పంచుకోవాలో.. సిద్ధంగా ఉంచుకునే ఉంటారు. ఇలా చాలా మంది ప్రేమికులకు సినిమా అనేది ఒక భాగం. అందుకే ప్రేమ గురించి గతంలో లెక్కలేనన్ని సినిమాలు వచ్చేశాయి. అలా ప్రేమికులను మెప్పించిన ఆ సినిమాలు మళ్లీ రీరిలీజ్ అవుతున్నాయి. వాలెంటైన్స్ డే నాడు వచ్చే చిత్రాలు ఏంటో చూద్దాం. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కాంబినేషన్లో 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' చిత్రం విడుదలై సూపర్ హిట్ కొట్టింది. 2008లో విడుదలైన ఈ సినిమా గతేడాదిలోనే రీ రిలిజ్ అయి భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల అవుతుంది. ఇందులో హీరో సూర్య డ్యుయల్ రోల్లో మెప్పించాడు. హ్యారీస్ జైరాజ్ సంగీతం ఈ మూవీకి పెద్ద ప్లస్ అయింది. సిద్ధార్థ్ ప్రేమ కథా చిత్రాల్లో 'ఓయ్' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో షామిలీ హీరోయిన్గా అద్భుతంగా నటించింది. ఈ సినిమా 2009లో రిలీజ్ అయి మంచి లవ్ స్టోరీగా మిగిలిపోయింది. సుమారు 15 ఏళ్ల తర్వాత వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి మరోసారి వచ్చేస్తుంది. ఈ సినిమా కోసం యూత్ బాగానే ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పాన్ ఇండియా రేంజ్లో భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం సీతారామం. 2022లో వచ్చిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఎమోషనల్ లవ్ స్టోరీతో ఆకట్టుకుంది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా క్లాసికల్ హిట్‌గా నిలిచింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి మరోసారి వచ్చేస్తుంది. 1998లో బ్లాక్‌బస్టర్ అందుకున్న తొలిప్రేమ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం ప్రేమికుల మనసులను గెలుచుకొని బ్లాక్బాస్టర్ అయింది. ఒక రకంగా పవన్‌కు ఈ చిత్రం స్టార్‌డమ్‌ను కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఇప్పటికే గతంలో రీ రిలీజ్ కావడంతో ఇప్పుడు తక్కువ సంఖ్యలో మాత్రమే థియేటర్లలోకి రానుంది. అలానే ఈ చిత్రాలతో పాటు సిద్ధార్, త్రిష జంటగా నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', పన్నెండేళ్ల క్రితం శర్వానంద్, అంజలి జై కాంబినేషన్లో వచ్చిన 'జర్నీ' సినిమా కూడా రీ రిలీజ్ కానున్నాయి. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ పలు ప్రేమ కథా చిత్రాలు రీ రిలీజ్ కానున్నాయి. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్ తో పాగల్ హై', మొహబ్బతే వంటి హిట్ సినిమాలు కూడా రానున్నాయి. ఈ వాలెంటైన్స్ డే నాడు సినిమా అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు. -
బ్యాటరీ బిజినెస్‌పై ఓయ్! రిక్షా వేలకోట్లలో పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ ఓయ్! రిక్షా దేశీయంగా బ్యాటరీల స్వాపింగ్ సౌకర్యాలపై దృష్టి పెట్టింది. ఇందుకు రానున్న మూడేళ్లలో రూ. 3,700 కోట్లను ఇన్వెస్ట్ చేయాలని ప్రణాళికలు వేసింది. తద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీ స్వాపింగ్ మౌలికసదుపాయాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ సీఈవో మోహిత్ శర్మ పేర్కొన్నారు. ఈ క్రమంలో మరోసారి బ్యాటరీ స్వాపింగ్ బిజినెస్ విస్తరణకుగాను రెండేళ్లలో రూ. 150–220 కోట్లు అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరికల్లా 10,000 లిథియం అయాన్ బ్యాటరీలను వినియోగించాలని కంపెనీ తొలుత ప్రణాళికలు వేసింది. అయితే కోవిడ్–19 సెకండ్ వేవ్ దెబ్బతీయడంతో 5,000 వాహనాలకు సరిపడా 6,500 బ్యాటరీలను అందించాలని ఆశిస్తోంది. 5,000 మంది డ్రైవర్ల భాగస్వామ్యంతో ఈరిక్షాల ద్వారా వినియోగదారులకు షేర్డ్, ఎలక్ట్రిక్, మైక్రో మొబిలిటీ సేవలు అందిస్తోంది. బ్యాటరీ స్వాపింగ్ బిజినెస్‌లోకి కొత్తగా ప్రవేశించినప్పటికీ 250–300 మంది డ్రైవర్లను భాగస్వాములుగా చేసుకున్నట్లు శర్మ వెల్లడించారు. -
కొండాపూర్‌లో ఓయో ఉద్యోగిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓయో ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. కొండాపుర్‌లోని కాకతీయ రెసిడెన్సీలో స్నేహితులతో కలిసి మౌనిక (25) అనే యువతి నివాసముంటోంది. హరియాణా గురుగ్రామ్‌కు చెందిన ఆమె ఓయోలో ఉద్యోగం చేస్తోంది. మౌనిక మంగళవారం తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సూసైడ్‌కు కారణాలు తెలియాల్సి ఉంది. పోస్ట్‌మార్టం నిమిత్తం మౌనిక మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
‘అమ్మమ్మగారిల్లు’ ఫస్ట్ లుక్
శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్ లో నాగశౌర్య, బేబి షామిలి జంటగా కె.ఆర్ మరియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. ఈ సినిమాకు సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ, ‘తొలిసారి చక్కని కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నా. షూటింగ్ చేస్తున్నంత సేపు సెట్ లో పండగ వాతావారణంలా కోలాహాలంగా ఉంది. కుటుంబ అనుబంధాలు..ఆప్యాయతలు..అనురాగాలు.. అందులో వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలు.. ఆవేదన ఎలా ఉంటుందనేది దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. కథను నమ్మి సినిమా చేశాం. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా ఉంటాయి. క్వాలిటీగా సినిమా చేసిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమాతో నేను మరింత దగ్గరవుతాను` అని అన్నారు. హీరోయిన్ షామిలి మాట్లాడుతూ, ‘‘ఓయ్’ సినిమా తర్వాత సరైన కథ కుదరకపోవడంతోనే మరో సినిమా చేయలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ‘అమ్మమ్మగారిల్లు’ కథ నచ్చడంతో సినిమాకు వెంటనే ఒప్పుకున్నాను. నా క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. నాగశౌర్య తో సినిమా చేయడం సంతోషంగా ఉంది. అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు’ అని అన్నారు. దర్శకుడు సుందర్ సూర్య మాట్లాడుతూ, ‘రిలేషన్ నెవెర్ ఎండ్ అనే కాన్సెప్ట్ ను ఆధారంగా చేసుకుని రాసిన కథ ఇది. దర్శకుడిగా నాకిది తొలి సినిమా. తెరపై సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ కు థియేటర్ లో ఉన్నామన్నా ఫీలింగ్ కాకుండా పండగ వాతావరణంలో తమ కుటుంబంతో గడుపుతున్న అనుభూతి కలుగుతుంది. నాగశౌర్య అద్భుతంగా నటించాడు. ఎమోషన్ సన్నివేశాల్లో ఒదిగిపోయాడు. మిగతా నటీనటులంతా కూడా తమ పాత్రల ఫరిది మేర అద్భుతంగా నటించారు. ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చి నిర్మాతలు రాజేష్, ఆర్ .కె గారికి కృతజ్ఞతలు’ అని అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, ‘సినిమా బాగా వచ్చింది. దర్శకుడు ప్రతీ సన్నివేశాన్ని హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారు. అలాగే నాగశౌర్య నటన సినిమాకు హైలైట్ గా ఉంటుంది. నటనపై ఆయన కమిట్ మెంట్.. డెడికేషన్ చాలా బాగున్నాయి. భవిష్యత్ లో పెద్ద స్టార్ అవుతాడు. మేము సినిమా నిర్మించి ఎంత అనుభూతి పొందామో....సినిమా చూసిన తర్వాత అంతే అనుభూతి ప్రేక్షకులు పొందుతారు’ అని అన్నారు. -
‘ఓయ్’ అమ్మాయి మళ్లీ వచ్చింది..!
బాలనటిగానే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న షామిలి హీరోయిన్ గా ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన ఓయ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన షామిలి, తొలి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యింది. ముఖ్యంగా ఆ సినిమాలో షామిలి లుక్ విషయంలో కూడా విమర్శలు రావటంతో కాస్త స్లిమ్ అయ్యి కోలీవుడ్ మీద దృష్టి పెట్టింది. కోలీవుడ్ లో బిజీ అవుతున్న ఈ భామ, మరోసారి టాలీవుడ్ వైపు అడుగులేస్తోంది.ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ‘అమ్మమ్మగారిల్లు’ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సుందర్ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో వేసవిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. -
ధనుష్ చిత్రం నుంచి తప్పుకున్న షామిలి
లిటిల్స్టార్గా పేరు తెచ్చుకున్న బాల నటి షామిలి ఇప్పుడు హీరోయిన్గా రంగప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే తెలుగులో ఓయ్ అనే చిత్రంలో కథానాయకిగా నటించిన షామిలి తమిళంలో మాత్రం ఇప్పుడే పరిచయం అవుతున్నారు. ఒకే సారి రెండు చిత్రాలను అంగీకరించారు. అందులో ఒకటి వీర శివాజీ, రెండోది కొడి చిత్రం. వీర శివాజీ చిత్రంలో విక్రమ్‌ప్రభుతో నటిస్తున్నారు. ఇక కొడి చిత్రంలో ధనుష్‌తో రొమాన్స్ చేయడానికే షామిలికి కాలం కలిసిరాలేదు. ప్రభుసాలమన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసిన ధనుష్ తాజాగా కొడి చిత్రంలో నటిస్తున్నారు. దురెసైంథిల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షామిలి, త్రిషలను ఎంపిక చేశారు. దనుష్ తొలిసారిగా ద్విపాత్రాభినం చేస్తున్న ఇందులో త్రిష ప్రతినాయకిగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఒకే షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేయడానికి యూనిట్ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం వీరశివాజీ చిత్రంలో నటిస్తున్న షామిలి ధనుష్ చిత్రానికి కాల్షీట్స్ సర్దుబాటు చేయలేక పోయారట. దీంతో ఆమెను చిత్రం నుంచి తొలగించి కాదలుమ్ కడందుపోగుమ్ చిత్రం ఫేమ్ మడోనాను కొడి చిత్ర నిర్మాతలు ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు వెట్రిమారన్,ఎస్కేప్ ఆర్టిస్ట్ మదన్ నిర్మిస్తున్నారు. కొడి చిత్రం నుంచి వైదొలగడం గురించి నటి షామిలి తరపు నుంచి తెలిసిందేమిటంటే అందులో ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలను తగ్గించడం వల్లే ఆ చిత్రాన్ని వదులుకున్నారని. ఏదేమైనా ధనుష్ చిత్రం నుంచి షామిలి తప్పుకోవడం టాక్ ఆష్ ది ఇండస్ట్రీగా మారింది. -
రోహిత్ సరసన 'కథలో రాజకుమారి'గా..
బాలనటిగా జాతీయ స్థాయిలోగుర్తింపు తెచ్చుకున్న నటి షామిలి. తరువాత 'ఓయ్' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆశించిన స్ధాయిలో విజయం సాధించలేకపోయింది. ముఖ్యంగా లుక్ విషయంలో తీవ్రంగా నిరాశపరిచిన షామిలి ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. ఈ సినిమా తర్వాత వెండితెరకు గుడ్ బై చెప్పిన షామిలి, ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. ఇటీవల ఉన్నత చదువులు ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చిన షామిలి ఫోటోషూట్స్ తో హల్చల్ చేస్తుంది. అక్క బావలు షాలిని, అజిత్‌లకు ఉన్న పరిచయాలతో సినిమా ప్రయత్నాలు కూడా మొదలెట్టేసింది. షామిలి చేసిన ఫోటో షూట్ లకు మంచి స్పందనే వస్తోంది. ఇప్పటికే చాలామంది తమిళ దర్శకులు షామిలితో సినిమాకు రెడీ అయిపోయారు. తెలుగులో కూడా ఓ ఇంట్రస్టింగ్ సినిమాకు కమిట్ అవుతోంది షామిలి. నారా రోహిత్ హీరోగా కొత్త దర్శకుడు మహేష్ సూరపనేని తెరకెక్కిస్తున్న 'కథలో రాజకుమారి' సినిమాలో హీరోయిన్గా నటించేందుకు అంగీకరించింది. మరి రీ ఎంట్రీ లో అయినా షామిలి అలరిస్తుందేమో చూడాలి.


