బ్యాటరీ బిజినెస్‌పై ఓయ్‌! రిక్షా వేలకోట్లలో పెట్టుబడులు

Oye! Rickshaw Plans Investment Worth Over rs3700 Cr For Battery Infrastructure - Sakshi

రూ. 3,700 కోట్ల పెట్టుబడులకు ప్రణాళిక 

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ మొబిలిటీ స్టార్టప్‌ ఓయ్‌! రిక్షా దేశీయంగా బ్యాటరీల స్వాపింగ్‌ సౌకర్యాలపై దృష్టి పెట్టింది. ఇందుకు రానున్న మూడేళ్లలో రూ. 3,700 కోట్లను ఇన్వెస్ట్‌ చేయాలని ప్రణాళికలు వేసింది. తద్వారా ఎలక్ట్రిక్‌ వాహనాలకు బ్యాటరీ స్వాపింగ్‌ మౌలికసదుపాయాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ సీఈవో మోహిత్‌ శర్మ పేర్కొన్నారు. ఈ క్రమంలో మరోసారి బ్యాటరీ స్వాపింగ్‌ బిజినెస్‌ విస్తరణకుగాను రెండేళ్లలో  రూ. 150–220 కోట్లు అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరికల్లా 10,000 లిథియం అయాన్‌ బ్యాటరీలను వినియోగించాలని కంపెనీ తొలుత ప్రణాళికలు వేసింది. అయితే కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ దెబ్బతీయడంతో 5,000 వాహనాలకు సరిపడా 6,500 బ్యాటరీలను అందించాలని ఆశిస్తోంది. 5,000 మంది డ్రైవర్ల భాగస్వామ్యంతో ఈరిక్షాల ద్వారా వినియోగదారులకు షేర్డ్, ఎలక్ట్రిక్, మైక్రో మొబిలిటీ సేవలు అందిస్తోంది. బ్యాటరీ స్వాపింగ్‌ బిజినెస్‌లోకి కొత్తగా ప్రవేశించినప్పటికీ 250–300 మంది డ్రైవర్లను భాగస్వాములుగా చేసుకున్నట్లు శర్మ వెల్లడించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top