ఓటీటీలోకి వచ్చేసిన 'గుంటూరు కారం'.. ఆ వర్షన్‌లో మరింత క్రేజ్‌ | Sakshi
Sakshi News home page

Guntur Kaaram Streaming OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'గుంటూరు కారం'

Published Fri, Feb 9 2024 9:45 AM

Guntur Kaaram Streaming On OTT Now - Sakshi

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంపై నెగటివ్‌ కామెంట్లు వచ్చినా కూడా బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌ కొట్టింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చిన గుంటూరు కారం సుమారు రూ. 280 కోట్లకు పైగానే కలెక్ట్‌ చేసింది. మహేశ్‌ కెరీర్లోనే మూడోసారి రూ. 200 కోట్ల మార్క్‌ను ఈ చిత్రంతో అందుకున్నారు.

సినిమా టాక్‌తో సంబంధం లేకుండా సూపర్‌ కొట్టి టాలీవుడ్‌లో తన రేంజ్‌ ఏంటో మరోసారి చూపించాడు ప్రిన్స్‌ మహేశ్‌.. ఆయన క్రేజ్‌కు తగ్గట్లే గుంటూరు కారం ఓటీటీ రైట్స్‌ను భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. ఈ క్రమంలో నేడు ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.

ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు.

హిందీలో క్రేజ్‌
టాలీవుడ్‌ నుంచి ఇప్పటికే అల్లు అర్జున్‌, ‍ప్రభాస్‌,తారక్‌,రామ్‌ చరణ్‌ వంటి స్టార్స్‌ బాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో మహేశ్‌ కూడా బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని ఆయన ఫ్యాన్స్‌ కోరుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన SSMB29 చిత్రాన్ని డైరెక్టర్‌ రాజమౌళితో ప్లాన్‌ చేశారు. ఆ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఇలాంటి సమయంలో నెట్‌ ఫ్లిక్స్‌ ద్వారా 'గుంటూరు కారం' చిత్రాన్ని హిందీలో విడుదల చేశారు మేకర్స్‌. ఇప్పటికే సినిమా చూసిన ఆయన అభిమానులు ఇప్పుడు హిందీలో మరోసారి రమణగాడిని చూస్తున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement