ఓటీటీలోకి 'గుంటూరు కారం'.. అదే ట్విస్ట్ ఇవ్వబోతున్నారా? | Sakshi
Sakshi News home page

Guntur Kaaram OTT Release: మహేశ్ ఫ్యాన్స్‌కి కొత్త టెన్షన్.. ఓటీటీ రిలీజ్ అంతకంటే ముందే?

Published Sat, Jan 20 2024 4:51 PM

 Guntur Kaaram Movie OTT Release Netflix In 28 Days - Sakshi

సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' హవా కాస్త తగ్గింది. ఈ సినిమా ఆడుతున్న థియేటర్లలో కొన్నిచోట్ల 'హనుమాన్' కనిపిస్తోంది. ఇకపోతే సంక్రాంతి కానుకగా రిలీజైన మహేశ్ సినిమా.. ఊహించని విధంగా బెన్ ఫిట్ షోల నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా టాక్ ఏం మారలేదు. అయితే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ విషయంలో ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

'గుంటూరు కారం' సినిమాలో మహేశ్ యాక్టింగ్ తప్పితే మిగతా వాటిపై ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. డైరెక్టర్ త్రివిక్రమ్‪‌తో పాటు సంగీత దర్శకుడు తమన్‌పై విమర్శలు గట్టిగానే వచ్చాయి. అయితే చిత్రబృందం మాత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌కి తమ సినిమా నచ్చేసిందని చెబుతోంది. వీటి సంగతి పక్కనబెడితే వారంలో రూ.212 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?)

సరే 'గుంటూరు కారం' టాక్-కలెక్షన్స్ గురించి కాసేపు పక్కనబెడితే ఓటీటీ రిలీజ్ విషయమై ఇప్పుడు ఓ టాక్ వినిపిస్తోంది. డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్.. చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మహేశ్ కొత్త సినిమాని 28 రోజుల్లోపే ఓటీటీలోకి తీసుకురానుందని సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే ఫిబ్రవరి రెండో వారంలో అంటే 9 లేదా 10వ తేదీన 'గుంటూరు కారం' ఓటీటీలో వచ్చేయొచ్చు. అయితే 'సలార్' ఓటీటీ విడుదలనే దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారు. 

ఎందుకంటే డిసెంబరు 22న థియేటర్లలోకి వచ్చిన సలార్.. జనవరి 20న ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో 'హనుమాన్' విన్నర్‌గా నిలిచింది. 'గుంటూరు కారం', 'నా సామి రంగ' చిత్రాలు పాస్ కాగా.. 'సైంధవ్' సినిమా సరైన ప్లానింగ్ లేకుండా వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో దారుణంగా ఫెయిలైనట్లు తెలుస్తోంది. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ)

Advertisement
 
Advertisement