ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా? | Sakshi
Sakshi News home page

Joe Movie OTT: డబ్బింగ్ సినిమా.. మనోళ్లకు భలే కనెక్ట్ అయిపోయింది!

Published Fri, Jan 19 2024 5:16 PM

Joe Movie OTT Telugu Version Details  - Sakshi

ఓటీటీల జమానా పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేస్తున్నాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ.. యువతకు సైలెంట్‌గా ఎక్కేస్తుంది. చాలారోజుల తర్వాత ఓ మంచి ప్రేమకథ చూశామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైనప్పటికీ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏంటా సినిమా? కథేంటి?

(ఇదీ చదవండి: చెంపదెబ్బ వల్ల చాలా గట్టిగా ఏడ్చేశాను: హీరోయిన్ రష్మిక)

'జో' కథేంటి?
జో.. చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలిరోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్నిరోజుల తర్వాత సుచిత్ర కూడా జో ని ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు మనస్పర్థలు వస్తాయి. దీంతో ఆరు నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్లిపోతుంది. ఓ రోజు సడన్‌గా ఫోన్ చేసి.. పెళ్లి గురించి ఇంటికొచ్చి మాట్లాడమని జో కి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రకు మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శ్రుతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

ఏ ఓటీటీలో ఉంది?
తమిళంలో గత నవంబరు 24న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. తాజాగా జనవరి 15న సంక్రాంతి కానుకగా హాట్‌స్టార్‌లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండటంతో మనోళ్లు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. 'ప్రేమమ్', 'హృదయం', 'రాజారాణి' లాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాల ఇష్టపడేవారిని ఇది అలరిస్తోంది. అలానే సినిమాలో 'జో' మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు ఇంకా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి. మీరు కచ్చితంగా ఏడ్చేస్తారు!

ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్లు దూరమైతే.. మనం చనిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఓ రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే పాయింట్‌తో ఈ సినిమా తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిచ్చోడిలా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ.. ఇలా మూవీ మొత్తం ఎమోషన్స్‌తో నింపేశారు. ఎలాంటి పరిస్థితిలో అయినాసరే ఫ్రెండ్స్, ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం బాగుంది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన 21 సినిమాలు)

 
Advertisement
 
Advertisement