ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రానున్న 21 సినిమాలు | List Of 21 New Movies And Web Series Releasing On OTT Platforms On January 19th, 2024 - Sakshi
Sakshi News home page

This Friday OTT Movie Releases: వీకెండ్ ధమాకా.. ఓటీటీల్లో 21 మూవీస్ రిలీజ్

Published Wed, Jan 17 2024 9:30 PM

Friday OTT Release Movies Telugu January 19th 2024 - Sakshi

ఇంకా సంక్రాంతి హడావుడి నడుస్తోంది. అలానే మరో వీకెండ్ కూడా వచ్చేసింది. పండగ కానుకగా గతవారం రిలీజైన మూవీస్ సందడి ఇంకా నడుస్తోంది. ఈ నాలుగింటిలో 'హనుమాన్' రచ్చ కొనసాగడం గ్యారంటీ. ఈ క్రమంలోనే ఈ వారం ఒక్కటంటే ఒక్క మూవీ థియేటర్లలో రిలీజ్ కావట్లేదు. కాబట్టి అందరి దృష్టి ఆటోమేటిక్‌గా ఓటీటీలపై పడుతుంది. అందుకు తగ్గట్లే ఈ శుక్రవారం 20కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

అయితే ఈ వీకెండ్ ఓటీటీల రిలీజుల విషయానికొస్తే 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమా, 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' వెబ్ సిరీస్ మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. మిగతావన్నీ కూడా పలు ఇంగ్లీష్ మూవీస్-వెబ్ సిరీసులే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏమన్నా సడన్‪‌గా వీకెండ్ ఓటీటీల్లో రిలీజ్ అవుతాయేమో చూడాలి. ఇంతకీ ఈ శుక్రవారం స్ట్రీమింగ్ మూవీస్ ఏంటో చూసేద్దాం.

ఈ శుక్రవారం రిలీజయ్యే మూవీస్ జాబితా (జనవరి 19th)

నెట్ ఫ్లిక్స్

 • ఫుల్ సర్కిల్ - ఇంగ్లీష్ సినిమా
 • లవ్ ఆన్ ద స్పెక్ట్రమ్ U.S: సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్
 • మి సోల్ డాడ్ టియన్ అలాస్ - స్పానిష్ సినిమా
 • సిక్స్ టీ మినిట్స్ - జర్మన్ మూవీ
 • ద బెక్‌తెడ్ - కొరియన్ సిరీస్
 • ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ - ఇంగ్లీష్ సినిమా
 • ద కిచెన్ - ఇంగ్లీష్ చిత్రం
 • కేప్టివేటింగ్ ద కింగ్ - కొరియన్ సిరీస్ (జనవరి 20)

అమెజాన్ ప్రైమ్

 • ఇండియన్ పోలీస్ ఫోర్స్ - హిందీ సిరీస్
 • ఫిలిప్స్ - మలయాళ సినిమా
 • హజ్బిన్ హోటల్ - ఇంగ్లీష్ సిరీస్
 • లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్ - ఇంగ్లీష్ సిరీస్
 • జొర్రో - స్పానిష్ సిరీస్

జియో సినిమా

 • లా & ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ సీజన్ 25 - ఇంగ్లీష్ సిరీస్

హాట్‌స్టార్

 • బ్రాన్: ద ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ - ఇంగ్లీష్ సిరీస్
 • కులీన్ రూనీ: ద రియల్ వగ్తా స్టోరీ - ఇంగ్లీష్ సిరీస్
 • క్రిస్టోబల్ బలన్సియా - స్పానిష్ సిరీస్
 • ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ‍్యాన్ - తెలుగు సినిమా
 • స్నేక్స్ SOS: గోవాస్ వైల్డెస్ట్ సీజన్ 4 - ఇంగ్లీష్ సిరీస్ (జనవరి 20)

బుక్ మై షో

 • ఒడవుమ్ ముడియాదు ఒలియవుమ్ ముడియాదు - తమిళ సినిమా
 • ఆల్ ఫన్ అండ్ గేమ్స్ - ఇంగ్లీష్ చిత్రం (జనవరి 20)

Advertisement
 
Advertisement