రష్మికతో ఎంగేజ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ | Vijay Devarakonda Clarify Comments On Engagement With Rashmika | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda-Rashmika: ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్? రౌడీహీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Jan 19 2024 7:24 PM | Updated on Jan 21 2024 9:20 AM

Vijay Devarakonda Clarify Comments On Engagement With Rashmika - Sakshi

టాలీవుడ్‌లో క్యూట్ కపుల్ అనగానే విజయ్ దేవరకొండ-రష్మికనే చాలామందికి గుర్తొస్తారు. ఈ మధ్య కాలంలో కలిసి సినిమాలు చేయనప్పటికీ వీళ్లపై ఏదో ఓ రూమర్ వస్తూనే ఉంటుంది. అలా కొన్నిరోజుల క్రితం సోషల్ మీడియాలో ఈ జంట నిశ్చితార్థం గురించి సౌండ్ గట్టిగా వినిపించింది. ఏకంగా ఫిబ్రవరిలోనే ఉంటుందని అన్నారు. ఇప్పుడు ఇది నిజమో కాదో అనేది స్వయంగా రౌడీ హీరోనే క్లారిటీ ఇచ్చేశాడు. అసలు విషయం చెప్పేశాడు.

(ఇదీ చదవండి: అయోధ్య కోసం ప్రభాస్ రూ.50 కోట్ల విరాళం.. క్లారిటీ ఇచ్చిన టీమ్)

ప్రస్తుతం 'ఫ్యామిలీ స్టార్' సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ.. 'లైఫ్ స్టైల్ ఆసియా' అనే మ్యాగజైన్ కోసం ఫొటోషూట్ చేశాడు. ఆ తర్వాత వీళ్లే విజయ్‌ని ఇంటర్వ్యూ కూడా చేశారు. పలు ప్రశ్నలు అడిగారు. అలా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఎంగేజ్‌మెంట్ న్యూస్ గురించి అడిగారు. దీంతో విజయ్ క్లారిటీ ఇచ్చేశాడు.

'ఫిబ్రవరిలో నాకు ఎలాంటి పెళ్లి, నిశ్చితార్థం జరగడం లేదు. ప్రతి ఏడాది ఈ మీడియా నాకు పెళ్లి చేయాలని చూస్తుంటుంది. ప్రతి ఏడాది ఈ రూమర్ వింటూనే ఉంటాను. నన్ను పట్టుకుని, నాకు పెళ్లి చేయాలని ఈ మీడియా చూస్తుందేమో?' అని ఉన్న విషయం చెప్పేశాడు. అయితే ఈ మధ్య కాలంలో బయటకు చెప్పనప్పటికీ విజయ్-రష్మిక కలిసి సీక్రెట్ ట్రిప్స్ వేస్తున్నారని వాళ్ల ఇన్‌స్టా చూస్తుంటే అనిపిస్తుంది. ఇప్పుడు విజయ్ చెప్పడంతో నిశ్చితార్థం, పెళ్లి లాంటివి ఇప్పట్లో ఏం లేవని స్పష్టత వచ్చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement