గుణశేఖర్‌ 'యుఫోరియా' గ్లింప్స్‌.. ఈసారి కొత్తగా ప్లాన్‌ చేశాడుగా! | Gunasekhar Euphoria Movie Glimpse Released | Sakshi
Sakshi News home page

Euphoria Movie: యుఫోరియా మూవీ గ్లింప్స్‌ రిలీజ్‌

Oct 7 2024 8:36 PM | Updated on Oct 8 2024 9:27 AM

Gunasekhar Euphoria Movie Glimpse Released

క్రియేటివ్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ రూటు మార్చాడు. ఈసారి భారీ బడ్జెట్‌ చిత్రాలు కాకుండా సింపుల్‌గా ఉండేలా యూత్‌కు కనెక్ట్‌ అయ్యే కాన్సెప్ట్‌ ఎంచుకున్నాడు. 'వరల్డ్‌ ఆఫ్‌ యుఫోరియా' సినిమా తెరకెక్కించాడు. ఇందులో భూమిక ప్రధాన పాత్రలో నటించగా సారా అర్జున్‌, నాజర్‌, రోహిత్‌, పృథ్వీరాజ్‌, లిఖిత కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు.

గ్లింప్స్‌లో డ్రగ్స్‌, అత్యాచారం వంటి సీరియస్‌ అంశాలను చూపించారు. ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందించాడు. చాలా రోజుల తర్వాత హిట్‌ కోసం ఆరాటపడుతున్న గుణశేఖర్‌కు యుఫోరియా తిరిగి సక్సెస్‌ను ఇచ్చేట్లు కనిపిస్తోంది. నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీన్‌ కె పోతన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement