ధూం ధాం పాటలు బాగున్నాయి | Gopichand and Vaitla unveils Dhoom Dham Teaser | Sakshi
Sakshi News home page

ధూం ధాం పాటలు బాగున్నాయి

Aug 13 2024 4:21 AM | Updated on Aug 13 2024 4:21 AM

Gopichand and Vaitla unveils Dhoom Dham Teaser

– గోపీచంద్‌  

‘‘ధూం ధాం’ టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది.. పాటలు బాగున్నాయి. రామ్‌ కుమార్‌ మంచి నిర్మాత. డైరెక్టర్‌ సాయి అంకితభావం ఉన్న వ్యక్తి. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్‌ ప్లే అందించిన గోపీమోహన్‌ ‘లౌక్యం’ సినిమా నుంచి నాతో పని చేస్తున్నారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని హీరో గోపీచంద్‌ అన్నారు. హెబ్బా పటేల్, చేతన్‌ కృష్ణ జంటగా సాయికిశోర్‌ మచ్చ దర్శకత్వం వహించిన చిత్రం ‘ధూం ధాం’. 

ఎంఎస్‌ రామ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 13న రిలీజ్‌ అవుతోంది. ఈ చిత్రం టీజర్‌ను గోపీచంద్, డైరెక్టర్‌ శ్రీను వైట్ల విడుదల చేశారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ– ‘‘టీజర్‌ చాలా బాగుంది. ‘దుబాయ్‌ శీను’ నుంచి ‘బాద్‌షా’  వరకు నా దగ్గర డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేశాడు సాయికిశోర్‌. రామ్‌ కుమార్‌గారు సినిమా మీద ప్యాషన్‌తో విదేశాల నుంచి ఇండస్ట్రీకి వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్‌ కావాలి’’ అన్నారు. ‘‘లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది’’ అని సాయికిశోర్‌ మచ్చా తెలిపారు. ‘‘ఈ సినిమాని ప్రేక్షకులు సపోర్ట్‌ చేస్తారని ఆశిస్తున్నాం’’ అని ఎంఎస్‌ రామ్‌ కుమార్‌ చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement