సింగర్‌తో సహజీవనం, బ్రేకప్‌.. ఇప్పుడు మరో సింగర్‌తో మ్యూజిక్‌ డైరెక్టర్‌ పెళ్లి?!

Is Gopi Sundar Amritha Suresh Tied Knot - Sakshi

కోలీవుడ్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌ అమృతా సురేశ్‌, మలయాళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీ సుందర్‌ ఎంతోకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే ఇటీవల వీరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. అమృత తన బర్త్‌డే రోజు కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ ఫొటోలకు ఇచ్చిన క్యాప్షన్‌లో గోపీ సుందర్‌ను భర్తగా అభివర్ణించింది. దీంతో వీరికి పెళ్లైపోయిందని అభిమానులు భావిస్తున్నారు.

ఇకపోతే గోపీసుందర్‌ గతంలో ప్రియ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి మాధవ్‌, యాధవ్‌ అని ఇద్దరు పిల్లలు. కానీ తర్వాత పలు కారణాలతో వీరు విడిపోయారు. ఆ తర్వాత సింగర్‌ అభయతో ప్రేమలో పడిన గోపీ 2008 నుంచి ఆమెతో సహజీవనం చేస్తూ వచ్చాడు. ఇటీవలే వీరిమధ్య పొరపచ్చాలు రావడంతో బ్రేకప్‌ చెప్పుకున్నారు. మరోవైపు అమృతా సురేశ్‌ గతంలో నటుడు బాలాను పెళ్లాడింది. వీరికి కూతురు కూడా ఉంది. కొన్నేళ్లకు వారు విడిపోయారు. రీసెంట్‌గా జరిగిన బర్త్‌డే వేడుకలను సైతం అమృత తన కూతురు, ప్రియుడు సుందర్‌తో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంది.

చదవండి: ఆమిర్‌ ఖానా? ఆయనెవరు? నాకైతే తెలీదబ్బా..
షెడ్యూల్స్‌ కారణంగా విడిపోయిన ప్రేమజంట!..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top