Annu Kapoor - Aamir Khan: ఆమిర్ ఖానా? ఆయనెవరు? నాకైతే తెలీదబ్బా..

ఆమిర్ ఖాన్.. బాలీవుడ్ ప్రేక్షకులకే కాదు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ పేరు తెలుసు. అంత పెద్ద స్టార్ హీరో ఈయన. ఆమిర్ నటించిన దంగల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ చిత్రాల్లో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక ఎప్పుడూ విలక్షణ పాత్రలు ఎంచుకునే ఈ స్టార్ హీరో ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా మూవీతో థియేటర్లలో అడుగుపెట్టబోతున్నాడు.
ఇదిలా ఉంటే అసలు ఆమిర్ ఖాన్ ఎవరో తనకు తెలీదంటున్నాడు బాలీవుడ్ నటుడు అన్ను కపూర్. అతడు నటించిన క్రాష్ కోర్స్ వెబ్ సిరీస్ శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఈ సందర్భంగా చిత్రప్రమోషన్స్‌లో పాల్గొన్న అతడికి ఆమిర్ ఖాన్ మూవీ లాల్ సింగ్ చద్దా గురించి అడిగారు. దీనికి కళ్లు చిట్లించుకున్న ఆయన అసలు ఆమిర్ ఖాన్ ఎవరని తిరిగి ప్రశ్నించాడు. అతడెవరో తెలియనప్పుడు, అతడి సినిమాలు తనకెలా తెలుస్తాయన్నాడు. ఆ మాటలతో అక్కడున్నవారు ఒక్కసారిగా షాకయ్యారు. తాను సినిమాలు చూడనని, తనవే కాకుండా ఎవరి మూవీస్ కూడా చూడనని తెలిపాడు. నిజంగానే తనకు ఆమిర్ ఖాన్ ఎవరో తెలియదని, అలాంటప్పుడు అతడి గురించి నేనేం చెప్పగలుగుతానన్నాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బీటౌన్‌లో వైరల్‌గా మారాయి.
చదవండి: బిగ్‌బాస్ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీరే..
ప్రియుడి ఇంట్లో అత్తతో కలిసి పూజ చేసిన జోర్దార్ సుజాత!