Jordar Sujatha Varalakshmi Pooja At Rocking Rakesh Home, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Jordar Sujatha Pooja Video: ప్రియుడి ఇంట్లో అత్తతో కలిసి పూజ చేసిన జోర్దార్‌ సుజాత!

Aug 7 2022 1:29 PM | Updated on Aug 7 2022 1:51 PM

Jordar Sujatha Varalakshmi Pooja At Rocking Rakesh Home - Sakshi

అయితే సుజాత మాత్రం ఈసారి ఏకంగా కాబోయే అత్తగారింట్లో వరలక్ష్మి వ్రతం చేసింది. ఈ వ్రతాన్ని ఇంత గ్రాండ్‌గా ఎప్పుడూ చేసుకోలేదని సంతోషం వ్యక్తం చేసింది.

తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది జోర్దార్‌ సుజాత. అదే యాసలో యాంకరింగ్‌ చేసి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం ఓ కామెడీ షోలోనూ చేరి మరింతమందికి జనాలకు చేరువైంది. అదే సమయంలో ఆ కామెడీ షోలోని హాస్య నటుడు రాకింగ్‌ రాకేశ్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమకు గుర్తుగా ఇరువురూ పలుమార్లు గిఫ్టులు ఇచ్చిపుచ్చుకున్నారు కూడా! అందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

తాజాగా సుజాత ఓ సర్‌ప్రైజింగ్‌ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరలక్ష్మి వ్రతం చేశానోచ్‌ అంటూ వీడియో రిలీజ్‌ చేసింది. సాధారణంగా పెళ్లికాని అమ్మాయిలు మంచి భర్త రావాలని, పెళ్లైనవాళ్లు వారి భర్త బాగుండాలని ఈ పూజ చేస్తారంటూ వ్రతం విశేషాన్ని చెప్పుకొచ్చింది. అయితే సుజాత మాత్రం ఈసారి ఏకంగా కాబోయే అత్తగారింట్లో వరలక్ష్మి వ్రతం చేసింది. రాకింగ్‌ రాకేశ్‌ ఇంట్లో అత్తయ్యతో కలిసి పూజలో పాల్గొంది. ఈ సందర్భంగా ఈ వ్రతాన్ని ఇంత గ్రాండ్‌గా ఎప్పుడూ చేసుకోలేదని సంతోషం వ్యక్తం చేసింది. ఇంటికి వచ్చినవాళ్లందరికీ వాయినం కూడా ఇచ్చానంటూ మురిసిపోయింది. అత్తయ్య.. ఇంట్లో అమ్మవారికి చీర కట్టినదగ్గర నుంచి ఫలహారాలు చేయడం వరకూ అన్నీ తానే దగ్గరుండి చూసుకుందంటూ ఆమె గొప్పతనాన్ని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది.

చదవండి: బిగ్‌బాస్‌ 6.. ఇప్పటివరకు ఫైనల్‌ అయిన కంటెస్టెంట్లు వీళ్లే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement