సోషల్‌మీడియాను షేక్‌ చేసిన సాంగ్‌ వీడియో వర్షన్‌ వచ్చేసింది | Golden Sparrow Video Song Out Now | Sakshi
Sakshi News home page

సోషల్‌మీడియాను షేక్‌ చేసిన సాంగ్‌ వీడియో వర్షన్‌ వచ్చేసింది

Mar 7 2025 1:50 PM | Updated on Mar 7 2025 3:27 PM

Golden Sparrow Video Song Out Now

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న 'గోల్డెన్‌ స్పారో' సాంగ్‌ వీడియో వర్షన్‌ వచ్చేసింది. నటుడు, దర్శక–నిర్మాత ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో విడుదలైన తాజా తమిళ చిత్రం ‘నిలువుక్కు ఎన్  మేల్‌ ఎన్నడి కోబమ్‌’. ఈ రొమాంటిక్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీలో అనిఖా సురేంద్రన్ , ప్రియా ప్రకాశ్‌ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్‌ మీనన్ , రమ్య రంగనాథన్  లీడ్‌ రోల్స్‌లో నటించారు.  ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలైంది. అయితే, ఒక ప్రేక్షకులకు ఈ మూవీ బాగా కనెక్ట్‌ అయిందని చెప్పవచ్చు.

ఈ మూవీలో ‘మామా మామా కమ్‌ అండ్‌ సింగు... క్వీనే వచ్చెను... నువ్వే కింగు...’ అంటూ మొదలయ్యే ఒక హిట్‌ సాంగ్‌ తాజాగా వీడియో వర్షన్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ హిట్‌ సాంగ్‌ను జీవీ ప్రకాష్‌ కుమార్‌తో సుబ్లాషిణి, ధనుష్, అరివు ఆలపించారు. ఈ మూవీని ‘జాబిలమ్మ నీకు అంత కోపమా..’ అనే టైటిల్‌తో తెలుగులో ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పి రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే.  ‘గోల్డెన్‌ స్పారో’ పాట లిరికల్‌ వీడియో తెలుగు వర్షన్‌ కూడా అందుబాటులో ఉంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement