మార్కెటింగ్ స్కామ్ నేపథ్యంలో ‘గ్యాంగ్ స్టర్’ | Gangster Movie Latest Updates | Sakshi
Sakshi News home page

మార్కెటింగ్ స్కామ్ నేపథ్యంలో ‘గ్యాంగ్ స్టర్’

Jan 16 2024 7:06 PM | Updated on Jan 16 2024 8:01 PM

Gangster Movie Latest Updates - Sakshi

గ్రానైట్ స్లాబులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ వ్యాపార రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాత వేలు మురుగన్. ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్‌ స్టర్‌’. రామ్‌ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి నెలలో తెలుగు, తమిళ్, హిందీ భాషలలో విడుదల కానుంది. 

ఈ సందర్భంగా నిర్మాత వేలు మురుగన్ మాట్లాడుతూ మార్కెటింగ్ స్కామ్ అనే నూత‌న‌ పాయింట్ పై సినిమా అంతా న‌డుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి పాయింట్ పై సినిమా రాలేద‌ని చెప్పాలి. ఇందులో హీరోలు ఎవ‌రు? విల‌న్స్ ఎవ‌రు? అనేది క్లైమాక్స్ వ‌ర‌కు తెలియ‌దు. ప్ర‌తి పాత్ర ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా క్యూరియాసిటీ క‌లిగించే విధంగా ఉంటుంది.  

ద‌ర్శ‌కుడు రామ్ ప్రభ సినిమాను ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా తెర‌కెక్కించారు. ప్ర‌జిన్ ప‌ద్మ‌నాభ‌న్ , జీవా మ‌రియు విజ‌య్ విశ్వ ముఖ్య పాత్ర‌లో న‌టించారు. అలాగే సాయిధ‌న్య, మోహ‌న సిద్ధి, షాలిని హీరోయిన్స్ గా ప‌రిచ‌యం చేస్తున్నాం. ముగ్గురు కూడా అందంతో పాటు అభిన‌యంతో ఆక‌ట్టుకుంటారు. ఆర్టిస్టులంద‌రూ త‌మ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టుగా పోటీప‌డుతూ న‌టించారు. క‌చ్చితంగా ఈ సినిమాకు ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ గ్యాంగ్ స్టర్  మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది అన‌డంలో సందేహం లేదు’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement