అక్టోబర్‌లోనే 'గేమ్‌ ఛేంజర్‌' వస్తాడు: హన్షిత | Game Changer Will Come In October | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌లోనే 'గేమ్‌ ఛేంజర్‌' వస్తాడు: హన్షిత

May 29 2024 7:06 PM | Updated on May 29 2024 7:41 PM

Game Changer Will Come In October

రామ్‌చరణ్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత వస్తున్న సినిమా కావడంతో చరణ్‌ ఫ్యాన్స్‌ భారీ అంచనాలతో ఉన్నారు. సౌత్‌ ఇండియాలో టాప్‌ డైరెక్టర్‌గా గుర్తింపు ఉన్న దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో గేమ్‌ ఛేంజర్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌లో  ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని దిల్‌ రాజు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. అయితే, తాజాగా ఆయన కూతురు, నిర్మాత హన్షిత అక్టోబర్‌లో రిలీజ్‌ కావచ్చని చెప్పారు.

తిరుమల శ్రీవారిని తాజాగా దర్శించుకున్న హన్షిత మీడియాతో మాట్లాడుతూ గేమ్‌ ఛేంజర్‌ అక్టోబర్‌లో రిలీజ్‌ అవుతుందని చెప్పారు. చాలా డిఫరెంట్‌ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కినట్లు ఆమె పేర్కొన్నారు. దిల్‌ రాజు సెప్టెంబర్‌లో విడుదల అవుతుందని చెబితే.. హన్షిత మాత్రం అక్టోబర్‌ అని క్లారిటీ ఇచ్చేశారు. అంటే దసరా టార్గెట్‌గా గేమ్‌ ఛేంజర్‌ ఉండవచ్చని తెలుస్తోంది. దసరా బరిలో అక్టోబర్‌  10వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' కూడా ఉంది. దసరా సెలవులు ముగియగానే గేమ్ ఛేంజర్ రిలీజ్‌ కావచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు. మరికొందరు మాత్రం రెండూ దసరా సెలవులను టార్గెట్‌ చేసుకునే ప్రేక్షకుల ముందుకు రావచ్చని అభిప్రాయపడుతున్నారు.

దేవర వాయిదా పడుతుందా..?
తాజాగా దిల్‌ రాజు కూతురు హన్షిత చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే దేవ‌ర వాయిదా పడే ఛాన్స్‌ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం దేవరకు సంబంధించి షూటింగ్‌ చాలా భాగం మిగిలివున్న‌ట్లు స‌మాచారం. షూటింగ్‌ తర్వాత కూడా పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా భారీగానే ఉంటుంది. ఒకవేళ దేవర మళ్లీ వాయిదా పడితే ఆక్టోబర్‌ 10ని తన మిత్రుడు రామ్‌ చరణ్‌కు తారక్‌ ఇవ్వచ్చని ఇండస్ట్రీలో టాక్‌. జూలై నెలాఖ‌రులోగా  గేమ్ ఛేంజ‌ర్ పూర్త‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే, దేవర యూనిట్‌ మాత్రం దసరా బరిలోనే ఉంది. అధికారికంగా వారు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement