శ్రీవారిని దర్శించుకున్న దిల్‌రాజు దంపతులు

Film Producer Dil Raju Refused To Talk With Media Over Tirumala Visit - Sakshi

సాక్షి, తిరుపతి: ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య తేజస్వినితో కలిసి తిరుపతి వచ్చిన దిల్‌ రాజు నేటి ఉదయం వీఐపీ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయన సతీమణికి తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో దిల్‌ రాజు మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. దిల్‌ రాజు దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇది రెండో సారి. మేలో తేజస్వినితో వివాహం అనంతరం దిల్‌ రాజు శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: దిల్ రాజు కీల‌క నిర్ణ‌యం)


 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top