హీరోల్లో రెబల్ స్టార్ టాప్‌ ప్లేస్.. హీరోయిన్లలో ఎవరంటే? | Famous Ormax Media Top Ten Ranks Of Cinema Stars In October Month | Sakshi
Sakshi News home page

Ormax Media Most Popular Stars: రెబల్ స్టార్ టాప్‌ ప్లేస్.. హీరోయిన్లలో ఎవరంటే?

Nov 21 2024 12:47 PM | Updated on Nov 21 2024 1:23 PM

Famous Ormax Media Top Ten Ranks Of Cinema Stars In October Month

ప్రముఖ ఆర్మాక్స్‌ మీడియా సంస్థ ప్రతినెల సినీస్టార్స్‌కు సంబంధించిన రేటింగ్స్‌ ఇస్తోంది. ఎప్పటిలాగే అక్టోబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ హీరో, హీరోయిన్ల జాబితాను వెల్లడించింది. హీరోల్లో తొలిస్థానంలో రెబల్ స్టార్ నిలవగా.. నటీమణుల్లో సమంత టాప్ ప్లేస్ దక్కించుకుంది. హీరో, హీరోయిన్లకు సంబంధించి టాప్-10 ర్యాంకులను వెల్లడిస్తూ పోస్టర్స్‌ను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

హీరోల్లో ప్రభాస్ తర్వాత విజయ్, షారూఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, అజిత్ కుమార్‌ తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరసగా అల్లు అర్జున్‌, మహేశ్ బాబు, సూర్య, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ఇటీవల హన్నీ బన్నీ ప్రేక్షకులను అలరించిన సమంత టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత ఆలియా భట్, నయనతార, దీపికా పదుకొణె, త్రిష టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకున్నారు. కాజల్ అగర్వాల్, శ్రద్దాకపూర్, సాయిపల్లవి, రష్మిక, కత్రినా కైఫ్‌ టాప్ టెన్‌లో నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement