‘మళ్ళీ మొదలైంది’.. ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ విడుదల

Ento Emo Jeevitham Lyrical Song Released From Malli Modalaindi Film - Sakshi

సుమంత్‌, నైనా గంగూలీ జంట‌గా  టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న  చిత్రం  ‘మళ్ళీ మొదలైంది’. ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాకు బోలెడంత ప్రమోషన్‌ వచ్చిన సంగతి తెలిసిందే. సుమంత రెండవ పెళ్లి చేసుకోబుతున్నాడు. ఇదిగో వెడ్డింగ్‌ కార్డు అంటూ ఆ మధ్య సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది.

తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ విడుదలైంది. యంగ్‌ హీరో నితిన్‌ ఈ పాటను విడుదల చేశాడు. ‘ఏంటో ఏమో జీవితం… ఎందుకిలా చేస్తాదో జీవితం’ అంటూ సాగే ఈ పాటను కృష్ణ చైతన్య రాయగా… సాయిచరణ్‌ పాడాడు. అనూప్ రూబెన్స్ స్వరాలు అందించాడు. కాగా ఈ చిత్రంలోసుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, మంజుల ఘ‌ట్ట‌మ‌నేని, పోసాని కృష్ణ ముర‌ళి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. 

చదవండి : 'విడాకుల తర్వాత జీవితం ఇలా'.. ఫోటో షేర్‌ చేసిన సుమంత్‌
'ఓనమ్‌' సంబురాల్లో సినీ తారలు..ఫోటోలు వైరల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top