మ్యాడ్‌ బ్లాక్‌బస్టర్‌ అవుతుంది | Dulquer Salmaan talks on MAD pre-release event | Sakshi
Sakshi News home page

మ్యాడ్‌ బ్లాక్‌బస్టర్‌ అవుతుంది

Oct 6 2023 6:23 AM | Updated on Oct 6 2023 6:23 AM

Dulquer Salmaan talks on MAD pre-release event - Sakshi

‘మ్యాడ్‌’ ఈవెంట్‌లో దుల్కర్‌ సల్మాన్, సిద్ధు, శ్రీ లీలతో యూనిట్‌

సంగీత్‌ శోభన్, నార్నే నితిన్, రామ్‌ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్‌’. సూర్యదేవర హారిక నిర్మాతగా పరిచయం అవుతూ, సాయి సౌజన్య సహ–నిర్మాతగా కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు ఓ ముఖ్య అతిథిగా హాజరైన దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్‌’ ట్రైలర్‌ నిజంగానే మ్యాడ్‌గా, చాలా ఫన్నీగా ఉంది.

నటీనటులు ఎవరూ కొత్తవాళ్లలా లేరు. ‘మ్యాడ్‌’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది’’ అన్నారు. మరో అతిథి సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్‌’ స్టోరీ లైన్‌ నాకు తెలుసు. సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు. ‘‘గుంటూరు కారం’ సెట్స్‌లో ‘మ్యాడ్‌’ ప్రస్తావన విన్నాను. ‘మ్యాడ్‌’ చిత్రం ‘మ్యాడ్‌’గా ఉంటుందట’’ అన్నారు శ్రీ లీల. ‘నా ఫ్రెండ్‌ అనుదీప్‌ లేక΄ోతే నేను లేను’’ అన్నారు కల్యాణ్‌ శంకర్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement