Anurag Kashyap: పాన్‌ ఇండియా కల్చర్‌ ఇండస్ట్రీని నాశనం చేస్తోంది: స్టార్‌ డైరెక్టర్‌

Director Anurag Kashyap Shocking Comments On Pan India Movie Culture - Sakshi

ప్రస్తుతం పాన్‌ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. భారీ బడ్జెట్‌, స్టార్‌ నటీనటులు అనే సంబంధం లేకుండ కంటెంట్‌ ఉన్న చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. బాషతో సంబంధం లేకుండ సౌత్‌ సినిమాలకు నార్త్‌లో సైతం విశేష ఆదరణ లభిస్తోంది. ఇందుకు ఇటీవల విడుదలైన కాంతార చిత్రమే ఉదాహరణ. ఈ ప్రాంతీయ సినిమా వచ్చిన ఈ కన్నడ మూవీ దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. దీంతో పాన్‌ ఇండియా అనే అంశం ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

చదవండి: వాల్తేరు వీరయ్య: కేక పుట్టిస్తున్న రవితేజ ఫస్ట్‌లుక్‌ టీజర్‌

ఈ నేపథ్యంలో కాంతార మూవీపై స్టార్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్చప్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌ నిలిచాయి. సైరత్ మూవీ విజయం మరాఠి ఇండస్ట్రీని నాశనం చేసిందని గతంలో ఆ మూవీ డైరెక్టర్‌ నాగరాజు మంజులే చేసిన వ్యాఖ్యలను అనురాగ్‌ గుర్తు చేశాడు. ప్రాంతీయ సినిమాలు, సొంత కథల సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ.. వాటి సక్సెస్‌ కారణంగా ఇండస్ట్రీ నాశనమైపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్‌ ఇండియా కల్చర్‌ హవా కొనసాగుతుందని, దానివల్ల బాలీవుడ్‌ ఇండస్ట్రీ నాశనమైపోతుందన్నాడు.   

చదవండి: అంజలి పెళ్లి చేసుకుందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్‌ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. దీంతో ఈ ట్రెండ్‌పైనే బాలీవుడ్‌ దర్శక-నిర్మాతలు దృష్టిపెడుతున్నారు. ఇప్పుడు ఇదే బాలీవుడ్‌ను నాశనం చేస్తోంది. పుష్ప, కేజీయఫ్‌ 2, కాంతార వంటి చిత్రాలు దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యిండోచ్చు. కానీ అలాంటి సినిమాలు బాలీవుడ్‌లో వర్కౌట్‌ కావు. వాటినే కాపీ కొట్టి పాన్‌ ఇండియా సినిమాలుగా తీయాలని చూస్తే మాత్రం బాలీవుడ్‌కు భారీ నష్టం తప్పుదు. ప్రస్తుతం బాలీవుడ్‌కు కావాల్సింది పాన్‌ ఇండియా సినిమాలు కాదు. ఇండస్ట్రీకి ధైర్యం చెప్పే సినిమాలు కావాలి. కథల్లో ఎప్పుడూ కొత్తదనం ఉండాలి.. అప్పుడే సినిమాలు హిట్‌ అవుతాయి’’ అని అనురాగ్‌ పేర్కొన్నాడు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top