Ravi Teja First Look Teaser Release From Waltair Veerayya Movie - Sakshi
Sakshi News home page

Waltair Veerayya-Ravi Teja First Look: రవితేజ మాస్‌ ఎంట్రీ, కేక పుట్టిస్తున్న ఫస్ట్‌లుక్‌

Dec 12 2022 2:06 PM | Updated on Dec 12 2022 3:02 PM

Ravi Teja First Look Teaser Release From Waltair Veerayya Movie - Sakshi

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కతున్న ఈ చిత్రంంలో మాస్ మహారాజా రవితేజ ఒక పవర్ ఫుల్ రోల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. దీంతో రవితేజకి లుక్‌, అప్‌డేట్‌ కోసం ఇటూ మెగా ఫ్యాన్స్‌, అటూ మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నేడు(సోమవారం) రవితేజ ఫస్ట్‌లుక్‌ సంబంధించిన అప్‌డేట్‌ వదిలింది.

చదవండి: అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే సెట్‌లో ప్రభాస్‌ సందడి, వీడియో, ఫొటోలు లీక్‌

రవితేజ ఫస్ట్‌లుక్‌ టీజర్‌ పేరుతో తాజాగా మాస్‌మహారాజకు సంబంధించిన అప్‌డేట్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ వీడియోలో రవితేజ తన నట విశ్వరూపం చూపించారు. యాక్షన్‌ సీక్వెన్స్‌ మలిచిన ఈ ఫస్ట్‌లుక్‌ టీజర్ మాస్‌ ఆడియన్స్‌ చేత కేక పుట్టించేలా ఉంది.  ‘ఫస్ట్ టైం ఒక మేకపిల్ల ను పులి ఎత్తుకొని వస్తున్నట్లు ఉన్నాది’ అనే డైలాగ్‌తో మాస్‌మహారాజా ఎంట్రీ ఇచ్చాడు. దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ నెక్ట్‌ లెవల్‌ అని చెప్పవచ్చు.

చదవండి: అంజలి పెళ్లి చేసుకుందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

చూస్తుంటే రవితేజ రోల్‌ను డైరెక్టర్‌ బాబీ చాలా పవర్ఫుల్‌గా తీర్చిదిద్దినట్లు ఉంది. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ ప్రచార చిత్రాలు సినిమా భారీ అంచనాలను పెంచగా.. తాజాగా విడుదలైన రవితేజ లుక్‌ మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకుని డబ్బింగ్‌ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ మూవీ జనవరి 13, 2022లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement