
'బాబీ' సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది డింపుల్ కపాడియా (Dimple Kapadia). హిందీలో అనేక హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అయితే అనిల్ కపూర్ (Anil Kapoor)తో చేసిన ఓ సినిమాలో మాత్రం డింపుల్ బాగా ఇబ్బందిపడింది. ఆ సీన్ కహానీ ఏంటో చూసేద్దాం.. 1986లో జన్బాజ్ మూవీలో అనిల్ కపూర్, డింపుల్ కపాడియా జంటగా నటించారు. ఫిరోజ్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులోని పాటలు ఇప్పటికీ పాడుకుంటూ, వింటూ ఉంటారు.

అనిల్ కపూర్, డింపుల్ కపాడియా
రొమాంటిక్ సీన్
అయితే ఈ మూవీలోని ఓ షాట్ కోసం.. ఫిరోజ్ ఖాన్ ఫామ్‌హౌస్‌ను ఎంచుకున్నారు. అక్కడ హీరోహీరోయిన్ల మధ్య కాస్త క్లోజప్ (ఇంటిమేట్) సీన్స్ పెట్టారు. ఆ విషయం హీరోహీరోయిన్లిద్దరికీ చెప్పారు. సమయానికి ఇద్దరూ సెట్‌లోకి వచ్చారు. కానీ అనిల్ చొక్కా విప్పగానే డింపుల్ అడుగు ముందుకు వేయలేదట! కారణం.. అతడి ఛాతీనిండా గుబురుగా వెంట్రుకలు ఉండటం! దీంతో దర్శకుడు ఆమెను బతిమాలుకోవడం మొదలుపెట్టాడు. చిట్టచివరకు ఆమె ఆ సీన్ చేసేందుకు అంగీకరించింది. అనిల్ ఛాతీపై వెంట్రుకలు చూసి డింపుల్ అతడిని చాలారోజులపాటు ఏడిపించిందట! ఇకపోతే జన్బాజ్ మూవీలోని ఓ సాంగ్‌లో హీరోయిన్ శ్రీదేవి తళుక్కుమని మెరిసింది.
చదవండి: అర్ధరాత్రి ఇంటికి రీతూ.. తననలాగే చూస్తా! డిప్రెషన్‌లో ఉన్నా: ధర్మ మహేశ్