దిల్‌ రాజు అల్లుడి కారును ఎత్తుకెళ్లిన దొంగ.. హృతిక్ రోషన్‌ బాగా తెలుసట! | Dil Raju Nephew Car Stolen By Thief In Hyderabad At Madhapur | Sakshi
Sakshi News home page

Dil Raju: దిల్‌ రాజు అల్లుడి కారు చోరీ.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

Oct 19 2023 7:46 AM | Updated on Oct 19 2023 9:41 AM

Dil Raju Nephew Car Stolen By A thief In Hyderabad At Madhapur - Sakshi

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్‌ రాజు అల్లుడికి చెందిన ఖరీదైన పోర్షే కారును చోరీకి గురైంది. మాదాపూర్‌లోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లోని జిమ్‌కు దిల్‌ రాజు అల్లుడు అర్చిత్‌ రెడ్డి వెళ్లారు. కారు పార్కింగ్ చేసి వెళ్లగా.. ఆయన తిరిగొచ్చేలోపే కారు ఎత్తుకెళ్లాడు ఓ దుండగుడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసును కొన్ని గంటల్లోనే చేధించారు. 

(ఇది చదవండి: ‘లియో’ మూవీ ట్విటర్‌ రివ్యూ)

అయితే సీసీటీవీ ఫుటేజ్‌ల సాయంతో కారును చోరీ చేసిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఈ కారు విలువ దాదాపు రూ.1.7 కోట్లు ఉంటుందని సమాచారం.  మాదాపూర్, జూబ్లీహిల్స్‌లోని వివిధ ప్రాంతాల్లో కారును గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే దర్యాప్తులో అతను చెప్పిన కారణాలు విని పోలీసులు అవాక్కయ్యారు. 

నిందితుడిని మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన సాయికిరణ్‌గా పోలీసులు గుర్తించారు. లగ్జరీ కార్లను దొంగిలించడం.. వాటిల్లో ఫ్యూయెల్‌ అయిపోగానే కారు అక్కడే వదిలేసి వెళ్లిపోవడం ‍అతనికి సరదా అని తెలిసింది. గతంలోనూ సాయికిరణ్‌పై బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి.

పోలీసులకు సాయి కిరణ్‌ చెప్పిన మాటలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తాను జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీకి పీఏనని.. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో తనకు పరిచయాలు ఉన్నాయని పోలీసులకు తెలిపాడు. సాయికిరణ్‌ మాటలు విన్న పోలీసులు అతని కుటుంబ సభ్యులను సంప్రదించారు. అయితే సాయికిరణ్‌ మానసికంగా ఆరోగ్యంగా లేడని.. బ్రైట్ లైఫ్ ఫౌండేషన్‌లో చికిత్స పొందుతున్నాడని  తెలిపారు. అయితే ఈ చోరీ సంఘటనపై సాయికిరణ్‌పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియాల్సి ఉంది. 

(ఇది చదవండి: ‘భగవంత్‌ కేసరి’ మూవీ ట్విటర్‌ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement