Dhanushs Maaran Movie Release Time Change on Disney+ Hotstar OTT - Sakshi
Sakshi News home page

Maaran Movie :ఓటీటీలో విడుదల అవుతున్న ధనుష్‌ 'మారన్‌' మూవీ

Mar 10 2022 4:17 PM | Updated on Mar 10 2022 6:07 PM

Dhanushs Maaran Movie Release Time Change on Disney+ Hotstar OTT - Sakshi

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన మారన్‌ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ఫ్లస్‌ హాట్‌స్టార్‌లో రేపు (మార్చి11)నుంచి ఈ సినిమా రిలీజ్‌ కానుంది. అయితే విడుదలకు చిన్న అంతరాయం ఏర్పడింది. రిలీజ్‌ టైమింగ్‌ను మార్చుతూ మూవీ టీం కొత్త అప్‌డేట్‌ను వెల్లడించింది. సాధారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అర్థరాత్రి దాటాక 12 గంటల నుంచే సినిమా అందుబాటులోకి వచ్చేస్తుంది.

కానీ మారన్‌ విషయంలో కొన్ని టెక్నికల్‌ కారణాలతో సాయంత్రం 5 నుంచి ప్రసారం చేయనున్నట్లు హాట్‌స్టార్‌ అధికారికంగా ప్రకటించింది. కాగా కార్తీక్‌ నరేన​ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ,మలయాళంలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ధనుష్‌కి జోడీగా మాళవిక మోహనన్‌ నటించింది. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement