మళ్లీ థియేటర్లలోకి ధనుష్ రొమాంటిక్ మూవీ | Dhanush's Mr Karthik Movie Re-Release Date Out | Sakshi
Sakshi News home page

మళ్లీ థియేటర్లలోకి ధనుష్ రొమాంటిక్ మూవీ

Jul 27 2025 12:12 PM | Updated on Jul 27 2025 12:21 PM

Dhanush's Mr Karthik Movie Re-Release Date Out

ధనుష్హీరోగా నటించిన రొమాంటిక్లవ్స్టోరీ మిస్టర్ కార్తీక్ మళ్లీ థియేటర్స్లోకి రాబోతుంది. ధనుష్ పుట్టినరోజు సందర్భంగా జులై 28న మిస్టర్ కార్తీక్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. . ఓం శివగంగా ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై శ్రీమతి కాడబోయిన లతా మండేశ్వరి సమర్పణలో నిర్మాత కాడబోయిన బాబురావు ఈ సినిమాను తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు.

రిచా గంగోపాధ్యాయ హీరోయిన్‌గా నటించిన చిత్రానికి శ్రీ రాఘవ దర్శకత్వం వహించారు. ‘మయక్కమ్‌ ఎన్న’ టైటిల్లో2016లో తమిళ్లో విడుదలై బ్లాక్బస్టర్హిట్గా నిలిచింది. తర్వాత మిస్టర్ కార్తీక్ పేరుతో సినిమాను తెలుగులో విడుదల చేశారు. ‘‘ఈ చిత్రంలో హీరోహీరోయిన్‌ మధ్య వచ్చే ఎమోషనల్‌ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇటీవల తమిళంలో మళ్లీ విడుదల చేయగా, మంచి విజయం దక్కింది. తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని కాడబోయిన బాబురావు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement