గౌరవమే స్వేచ్ఛ | Dhanush Captain Miller First Look Released | Sakshi
Sakshi News home page

గౌరవమే స్వేచ్ఛ

Jul 1 2023 3:59 AM | Updated on Jul 1 2023 3:59 AM

Dhanush Captain Miller First Look Released - Sakshi

ధనుష్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కెప్టెన్  మిల్లర్‌’. ప్రియాంకా అరుళ్‌ మోహనన్, నివేదితా సతీష్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, సందీప్‌ కిషన్  కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అరుణ్‌ మాథేశ్వరన్  దర్శకత్వంలో టీజీ త్యాగరాజన్  సమర్పణలో జి. శరవణన్, సాయి సిద్ధార్థ్, సెంథిల్‌ త్యాగరాజన్, అర్జున్  త్యాగరాజన్  నిర్మిస్తున్నారు. ‘గౌరవమే స్వేచ్ఛ’ అనే క్యాప్షన్ తో శుక్రవారం ‘కెప్టెన్  మిల్లర్‌’ ఫస్ట్‌ లుక్‌ను షేర్‌ చేశారు ధనుష్‌. ‘‘స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1930–1940 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో ధనుష్‌ మూడు గెటప్స్‌లో కనిపిస్తారు. ఆల్రెడీ 85 శాతం షూటింగ్‌ పూర్తయింది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement