Deepika Padukone Reacts On Divorce Rumours With Ranveer Singh, Deets Inside - Sakshi
Sakshi News home page

Deepika Response On Divorce Rumours: ఎట్టకేలకు విడాకుల వార్తలపై స్పందించిన దీపికా

Oct 13 2022 5:23 PM | Updated on Oct 13 2022 8:20 PM

Deepika Padukone Response On Divorce Rumours With Ranveer Singh - Sakshi

బాలీవుల్‌ స్టార్‌ కపుల్‌ దీపికా పదుకొనె-రణ్‌వీర్‌ సింగ్‌లు విడాకులు తీసుకోబుతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రణ్‌వీర్‌ నగ్న ఫొటోషూట్‌ వివాదం నుంచి వారి వైవాహిక బంధంలో మనస్పర్థలు వచ్చాయని, అందువల్లే వీరు విడిపోతున్నారనే వాదనలు వినిపించాయి. ఇక సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన రణ్‌వీర్‌-దీపికా విడాకుల వార్తలే దర్శనం ఇచ్చాయి. అయితే ఇప్పటి వరకు దీపికా-రణ్‌వీర్‌లు ఈ రూమర్లపై స్పందించలేదు. దీంతో ఈ వార్తలపై క్లారిటీ లేక ఈ జంట ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తమ విడాకుల రూమర్స్‌పై దీపికా స్పందించింది.

చదవండి: కాస్టింగ్‌ కౌచ్‌పై స్పదించిన బిగ్‌బాస్‌ దివి..

ఇటీవల ఓ ఎగ్జిబిషన్‌ ఈవెంట్‌లో పాల్గొన్న దీపికాకు ఓ విలేకరి నుంచి విడాకులపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అలాంటిది ఏం లేదని, అవన్ని వట్టి పుకార్లనంటూ కొట్టిపారేసింది. ‘మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. మేం చాలా హ్యాపీగా ఉన్నాం. గత వారం రణ్‌వీర్‌ ఓ మ్యూజిక్‌ ఫెస్టివల్లో భాగంగా ఇంటికి దూరంగా ఉన్నారు. ఆయన తిరిగి ఇంటికి రాగానే నన్ను చూసి పట్టలేనంద ఆనందం చూపించాడు’ అంటూ డైవర్స్‌ రూమర్లకు చెక్‌ పెట్టింది. కాగా ఆరేళ్లు ప్రేమలో మునిగి తేలిన దీపికా-రణ్‌వీర్‌లు నవంబర్‌ 14, 2018లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే.. షారుక్‌ ఖాన్‌ పఠాన్‌, ప్రభాస్‌ ప్రాజెక్ట్ కె చిత్రాలతో​ దీపికా బిజీగా ఉంది. 

చదవండి: నయన్‌ సరోగసీ వివాదం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం?

Advertisement
 
Advertisement
Advertisement