'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది దీపికా పదుకొణె (Deepika Pdukone). తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. అయితే ఓం శాంతి ఓం కంటే ముందు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయని, వాటన్నింటినీ తాను వదిలేసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ.. కొన్నిసార్లు మనం చూస్తుండగానే అన్నీ జరిగిపోతుంటాయి. నేను రెండేళ్లు మోడల్‌గా చేశాను.
రెడీగా లేను
అప్పటినుంచే సినిమా ఛాన్సులు రావడం మొదలైంది. చాలామంది దర్శకనిర్మాతలు నన్ను సంప్రదించారు. కానీ, అప్పటికి నేను సిద్ధంగా లేను. గ్లామర్ ప్రపంచంలో మోడల్‌గా అప్పుడే కదా కెరీర్ ప్రారంభించాను. ఇక్కడినుంచి సినిమాలకు షిఫ్ట్ అవడానికి ఇంకాస్త సమయం తీసుకోవాలనుకున్నాను. అందువల్లే నాకు వచ్చిన ఆఫర్లను ఎంతో సున్నితంగా రిజెక్ట్ చేశాను. నన్ను నమ్మి ఛాన్సులిచ్చిన అందరికీ నేనెంతో కృతజ్ఞురాలిని.
ఎప్పుడూ నేర్చుకుంటూనే..
ఓం శాంతి ఓం ఆఫర్ చేసినప్పుడు ఇదే కరెక్ట్ టైం అనిపించి సెట్‌లోకి అడుగు పెట్టాను. ర్యాంప్ వాక్ అయినా, యాక్టింగ్ అయినా.. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండేదాన్ని. ఇండస్ట్రీని, కళను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఇప్పటికీ సెట్‌లో ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. కాకపోతే గతంలో కంటే ఇప్పుడు నేను ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్నాను. అప్పుడు నేను చేసేది కరెక్టేనా? జనాలు ఏమనుకుంటారు? ఇలాంటి ఆలోచనలుండేవి.
సినిమా
కానీ, ఇప్పుడు నాకు నచ్చింది చేస్తున్నా.. నాకు నచ్చినట్లే ఉంటున్నా అని చెప్పుకొచ్చింది. దీపికా.. ఓం శాంతి ఓం సినిమా కంటే ముందు కన్నడలో ఐశ్వర్య అనే మూవీ చేసింది. తర్వాత మళ్లీ సాండల్‌వుడ్‌లో కనిపించనేలేదు. ఈమె తెలుగులో కల్కి 2898 ఏడీ సినిమా చేసింది. అయితే కొన్ని ప్రత్యేక డిమాండ్లు చేసిందన్న కారణంతో కల్కి సీక్వెల్ నుంచి ఆమెను తప్పించారు. అలాగే ప్రభాస్ స్పిరిట్ మూవీలోనూ నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ సడన్‌గా ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్- అట్లీ, షారూఖ్ ఖాన్ 'కింగ్' సినిమాలు చేస్తోంది.
చదవండి: సస్పెన్స్‌కు బ్రేక్.. వీడియో షేర్ చేసిన తెలుగు సీరియల్ నటి


