బుల్లితెర నటి అంజలి పవన్ రెండో బిడ్డకు జన్మనిచ్చి కొన్ని వారాలవుతోంది. కానీ, ఇంతవరకు పుట్టింది ఆడ? మగ? అని వెల్లడించలేదు. అలాగే బేబీ ఫోటోను, పేరును బయటపెట్టకుండా అభిమానులను సస్పెన్స్‌లో ఉంచింది. ఈ సస్పెన్స్‌కు తెర దించుతూ నవంబర్ 14న బాలల దినోత్సవం నాడు ప్రిన్స్ వచ్చేశాడంటూ ఓ వీడియో షేర్ చేసింది. అందులో తన కుమారుడి పేరు "జైవీర్ క్రితిక్ (జేవీకే)" అని వెల్లడించింది. ఇది చూసిన అభిమానులు పేరు చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు.
సీరియల్స్‌తో ఫేమస్
అంజలి.. మొగలిరేకులు, రాధా కల్యాణం, దేవత, శివరంజని వంటి పలు సీరియల్స్‌లో నటించింది. లెజెండ్, ఒక లైలా చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. కొంతకాలంగా బుల్లితెరకు దూరంగా ఉంటోంది. అంజలి 2017లో నటుడు సంతోష్ పవన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు చందమామ (ధన్వి) పుట్టింది. తను కూడా పలు షోలలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చందమామతో ఆడుకునేందుకు ఓ తమ్ముడు కూడా వచ్చేశాడు.
బిగ్‌బాస్ ఆఫర్
బిగ్‌బాస్ షోకు రమ్మని గత కొన్నేళ్లుగా అంజలి పవన్‌కు పిలుపు వస్తూనే ఉంది. ఎనిమిదో సీజన్‌కు వెళ్దామన్న ఆలోచన కూడా అంజలికి వచ్చింది. ఇందుకోసం అంతా సిద్ధం చేసుకుంది. కానీ సరిగ్గా షో మొదలయ్యే సమయానికి పాప ధన్వికి, భర్త పవన్‌కు చికెన్ గున్యా, టైఫాయిడ్ అని తేలింది. దీంతో బిగ్‌బాస్‌కు వెళ్లాలన్న ఆలోచన విరమించుకుంది. ఇక తొమ్మిదో సీజన్ సమయానికి ఆమె నిండు గర్భిణి కావడంతో ఈసారి కూడా ఆఫర్ రిజెక్ట్ చేసింది. మరి భవిష్యత్తులో షోలో కనిపిస్తుందేమో చూడాలి!


