యానిమల్‌ తరహాలో ‘దీనమ్మ జీవితం’ | Deenamma Jeevitham Pre Release Trailer Launch | Sakshi
Sakshi News home page

యానిమల్‌ తరహాలో ‘దీనమ్మ జీవితం’

Dec 31 2023 1:05 AM | Updated on Dec 31 2023 10:17 AM

Deenamma Jeevitham Pre Release Trailer Launch - Sakshi

దేవ్‌ బల్లాని, ప్రియా చౌహాన్, సరిత ప్రధాన పాత్రల్లో మురళీ రామస్వామి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దీనమ్మ జీవితం’. వై. మురళీకృష్ణ, వై. వెంకటలక్ష్మీ, డి. దివ్య సంతోషి, బి. సోనియా నిర్మించిన ఈ చిత్రం జనవరి 5న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో దేవ్‌ మాట్లాడుతూ– ‘‘మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రం ఇది.పెద్ద విజయాన్ని అందుకుంటామనే నమ్మకం ఉంది’’ అన్నారు.

‘‘యానిమల్‌’ వంటి రా అండ్‌ ఫ్యామిలీ ఫిల్మ్‌ ‘దీనమ్మ జీవితం’. తమిళ్, మలయాళంలోనే కాదు.. తెలుగులోనూ మంచి కంటెంట్‌తో సినిమా చేయగలరని నిరూపించే చిత్రమిది’’ అన్నారు మురళీ రామస్వామి. ‘సమాజంలో జరిగే కథ ఇది. తప్పకుండా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని ప్రియా చౌహాన్‌ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement