తెలుగులో విడుదల కానున్న తమిళ్‌ సూపర్‌ హిట్‌ సినిమా | DaDa movie Telugu Version Title With Papa Release Date locked | Sakshi
Sakshi News home page

తెలుగులో విడుదల కానున్న తమిళ్‌ సూపర్‌ హిట్‌ సినిమా

Nov 30 2024 1:56 PM | Updated on Nov 30 2024 2:56 PM

DaDa movie Telugu Version Title With Papa Release Date locked

తెలుగు తెర‌పైకి ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా రాబోతోంది. తమిళంలో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన 'డా..డా' ఇప్పుడు తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో రానుంది. జెకె ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు. డిసెంబ‌ర్ 13న‌ ఈ చిత్రాన్నిఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా వంటి నగరాల్లో కూడా గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.

గ‌త ఏడాది త‌మిళంలో 'డా..డా' మూవీ సెన్సేష‌న‌ల్ హిట్ సాధించించిన విషయం తెలిసిందే. కవిన్, అపర్ణ దాస్ ప్ర‌ధాన పాత్ర‌దారులుగా, డైరెక్ట‌ర్ గణేష్ కె బాబు తెర‌కెక్కించిన‌ ఈ చిత్రం త‌మిళ ఆడియన్స్‌ని విప‌రీతంగా ఆకట్టుకుంది. కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో డిస్ట్రిబ్యూట‌ర్‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. అతి త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా సుమారు 30 కోట్లు వసూళ్లు సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది.

తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కి తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ  'పా.. పా..' టైటిల్‌తో  తెలుగు ప్రేక్ష‌కుల‌ను కూడా బాగా ఆక‌ట్టుకుంటుంద‌ని నిర్మాత నీరజ కోట తెలిపారు. కామెడీ, భావోద్వేగం, ప్రేమ.. ఇవ‌న్నీ సరైన స్థాయిలో మిక్స్ చేసిన ఈ ఫీల్ గుడ్ ఎమోష‌న‌ల్ డ్రామా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా క‌నెక్ట్‌ అవుతుంద‌ని, బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వడం ఖాయ‌మ‌న్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు విడుద‌ల చేయ‌బోతున్నార‌ని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement