ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా రమేష్ రెడ్డి‌కి 'దాదాసాహెబ్ ఫాల్కే' పురస్కారం | Cinematographer Kushendar Ramesh Reddy Won Dadasaheb Phalke Award | Sakshi
Sakshi News home page

ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా రమేష్ రెడ్డి‌కి 'దాదాసాహెబ్ ఫాల్కే' పురస్కారం

May 4 2025 1:55 PM | Updated on May 4 2025 2:50 PM

Cinematographer Kushendar Ramesh Reddy Won Dadasaheb Phalke Award

‘రజాకార్’ చిత్రానికి దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరుదైన గౌరవం దక్కింది. ఈ చిత్రంలోని విజువల్స్‌ ప్రేక్షకులను మెప్పించాయి. అందుకు కారణమైన సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డికి అవార్డ్‌ దక్కింది.  ‘రజాకార్’ చిత్రంలోని విజువల్స్‌కు మంచి గుర్తింపు లభించింది. 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి పురస్కారం అందుకున్నారు. కేకే సెంథిల్ కుమార్ దగ్గర ఈగ, బాహుబలి 1,బాహుబలి 2,  RRR చిత్రాలకు ఆయన పనిచేశారు. అలా అంచలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు  దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ కెమెరామెన్‌గా నిలిచారు.

యాటా సత్యనారాయణ ‘రజాకార్’ చిత్రాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. నిర్మాత విజన్‌కు కుశేందర్ రమేష్ రెడ్డి కెమెరా తోడు అయింది. చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఈ చిత్రాన్ని మల్చడంలో ఆయన సినిమాటోగ్రఫీ ఎంతగానో తోడైందని చెప్పవచ్చు. ఇక ఆయన ప్రస్తుతం వానర సెల్యులాయిడ్ , డైరెక్టర్ మారుతి సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో వస్తున్న ‘బార్బరిక్' చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే  అల్లరి నరేష్ హీరోగా పొలిమేర ఫెమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా ఎస్ఎస్ఎస్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ మీద చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న 12A రైల్వే కాలనీ చిత్రానికి పని చేస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తారతమ్యం లేకుండా కంటెంట్ వున్న కథలని ఎంచుకుని తనదైన ప్రత్యేక శైలితో దర్శకుల ఆలోచలనలకి దృశ్యరూపం అందించాలని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement