పొల్లాచ్చిలో ప్రారంభం | Chiru158 begins major key schedule in Pollachi | Sakshi
Sakshi News home page

పొల్లాచ్చిలో ప్రారంభం

Jun 5 2026 3:28 AM | Updated on Jun 5 2026 3:28 AM

Chiru158 begins major key schedule in Pollachi

పొల్లాచ్చి వెళ్లింది చిరంజీవి అండ్‌ టీమ్‌. ‘వాల్తేరు వీరయ్య’ (2023) వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ‘చిరు158’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మలయాళ యువ హీరోయిన్‌ అనశ్వర రాజన్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో జరిగింది.

చిరంజీవి–అనశ్వరల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. కాగా, ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ తమిళనాడులోని పొల్లాచ్చిలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘దర్శకుడు బాబీ ఓ పవర్‌ఫుల్‌ కథను సిద్ధం చేశారు. ఈ సినిమాలో చిరంజీవి తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు.

ఇందుకోసం ఆయన ఫిజికల్‌గా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారు’’ అని యూనిట్‌ పేర్కొంది. ఇక ఈ చిత్రం ప్రధాన కథాంశం కోల్‌కతా నేపథ్యంలో సాగుతుందని, ఇందులో చిరంజీవి గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారని సమాచారం. అలాగే తండ్రీ కూతుళ్ల ఎమోషన్‌ ఈ సినిమా కథకు కీలకమని, చిరంజీవి–అనశ్వర తండ్రీ కూతుళ్లుగా కనిపిస్తారని తెలిసింది. కెవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్‌ .ఎస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement