Chiranjeevi Interesting Comments On Ram Charan And Upasana Konidela Baby, Deets Inside - Sakshi
Sakshi News home page

Chiranjeevi: మనవరాలి జాతకం అద్భుతం.. చిరంజీవి

Jun 20 2023 1:29 PM | Updated on Jun 20 2023 1:45 PM

Chiranjeevi Interesting Comments on Ram Charan, Upasana Baby - Sakshi

చిరంజీవి, రామ్‌చరణ్‌(పాత ఫోటో)

రామ్‌ చరణ్‌- ఉపాసన పండంటి ఆడ బిడ్డకి జన్మన్విడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తన కొడుక్కి బిడ్డ పుట్టడంతో మెగాస్టార్‌ చిరంజీవి ఆనందంతో ఉబ్బితబ్బి పోతున్నారు. మరోసారి తాత అయ్యానంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. మంగళవారం ఉదయమే హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌ వెళ్లి, తన మనవరాలిని చూశాడు చిరంజీవి.అనంతరం మీడియాతో మాట్లాడుతూ..మాకెంతో ఇష్టమైన మంగళవారం రోజు పాప పుట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

(చదవండి: చరణ్-ఉపాసన బిడ్డకు ఆ నంబర్ సెంటిమెంట్!?)

‘ మంగళవారం ఉదయం 1.49కి పాప పుట్టింది. మంచి ఘడియల్లో జన్మించిందని, జాతకం అద్భుతంగా ఉందంటున్నారు. ఆ ప్రభావం ముందు నుంచి మా కుటుంబంలో కనబడుతుంది. చరణ్‌ కెరీర్‌ ఎదుగుదల, వరుణ్‌ ఎంగేజ్‌మెంట్‌ ఇలా మా ఫ్యామిలీలో అన్ని శుభాలే జరుగుతన్నాయి’ అని చిరంజీవి అన్నారు. 

(చదవండి: సుధాకర్‌ కొడుక్కి అండగా మెగాస్టార్‌, ఆ బాధ్యత చిరంజీవిదేనట!)

తాను తాత అయిన ఆనందాన్ని ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు చిరంజీవి. ‘లిటిల్ మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం !! నీ రాకతో కోట్లాది మంది మెగా ఫ్యామిలీతో పాటు మా అందరికి ఆనందాన్ని పంచావు. రామ్‌ చరణ్‌, ఉపాసనలను తల్లిదండ్రులను చేశావు. మమ్మల్ని గ్రాండ్‌ పేరంట్స్‌ను చేశావు. ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నిన్ను కోట్లాది మంది మెగా ఫ్యామిలీ కుటుంబసభ్యులు  ఆశీర్వదిస్తారు' అని చిరు ట్వీట్‌ చేశాడు. 

Advertisement
 
Advertisement
Advertisement