చిన్నప్పటి ఫ్రెండ్ కోసం కదిలొచ్చిన చిరంజీవి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి! | Sakshi
Sakshi News home page

Chiranjeevi: స్నేహితుడికి మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్ చిరంజీవి

Published Sun, Oct 22 2023 6:00 PM

Chiranjeevi Helps Childhood Friend Puvvada Raja in Apollo Hospital - Sakshi

మెగాస్టార్ చిరంజీవి.. సినిమాల విషయంలో ఫెయిల్ కావొచ్చేమో కానీ సాయం చేసే విషయంలో ఎప్పుడూ టాప్‌లో ఉంటారు. సినీ కార్మికుల దగ్గర నుంచి అభిమానల వరకు చాలాసార్లు తన ఆపన్న హస్తాన్ని అందించారు. వీటిలో చాలావరకు బయటకు రావు. ఇప్పుడు అలానే ఓ విషయం జనాల దృష్టికి రాలేదు. కానీ ఓ వ్యక్తి ట్వీట్ చేయడంతో చిరు చేసిన సాయం వెలుగులోకి వచ్చింది. 

ఇంతకీ ఏమైంది?
157వ సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి.. తాజాగా హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో కనిపించారు. దీంతో ఎవరి కోసం వెళ్లారా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. చిరు చిన్నప్పుడు మొగల్తూరులో పెరిగారు. అక్కడ ఉన్నప్పుడు చాలామంది స్నేహితులు. అందులో పువ్వాడ రాజా అనే వ్యక్తి కూడా ఉన్నారు. తాజాగా ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న చిరు.. మర్చిపోలేని సాయం చేశారు.

(ఇదీ చదవండి: 'అల వైకుంఠపురములో' నటుడికి నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?)

ఫ్రెండ్ అనారోగ్య సమస్య తెలుసుకుని.. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో అతడికి చికిత్స ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా చిన్నప్పటి ఫ్రెండ్ రాజాని.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి కలిశాడు. డాక్టర్‌తో మాట్లాడి స్నేహితుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిరు సినిమాల గురించి మాట్లాడుకుంటే.. ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'గా వచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఆగస్టులో 'భోళా శంకర్'గా ఘోరమైన డిజాస్టర్ చవిచూశాడు. ప్రస్తుతం 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఫాంటసీ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. ఇందులో ఐదుగురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. డిసెంబరు నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది.

(ఇదీ చదవండి: అవార్డ్ విన్నింగ్ సౌత్ సినిమా.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి)

Advertisement
 
Advertisement