ప్రభాస్‌ను ఎవరైనా ప్రేమించాల్సిందే: చిరంజీవి | Chiranjeevi Extends Birthday Wishes To Prabhas | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ను ఎవరైనా ప్రేమించాల్సిందే: చిరంజీవి

Oct 23 2024 12:17 PM | Updated on Oct 23 2024 1:05 PM

Chiranjeevi Extends Birthday Wishes To Prabhas

ప్రభాస్‌కు మాత్రమే డై హార్ట్‌ ఫ్యాన్స్‌ ఉంటారు. నేడు ఆయన పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో చిత్రపరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్‌ ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వెండితెర రారాజుగా విలసిల్లుతున్న ప్రభాస్‌ మనసు కూడా ఎంతో ప్రత్యేకం. దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితిలు వచ్చినా సరే తన వంతు సాయం చేసేందుకు ముందుకొస్తాడు. అలా తను మీడియా ప్రపంచానికి దూరంగా ఉంటూనే అభిమానుల గుండెలకు దగ్గరగా ఉంటాడు. అందుకే ఆయన్ను అభిమానించని వారంటూ ఉండరని చెప్పవచ్చు. సోషల్‌మీడియా వేదికగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. నేడు #Happybirthdayprabhas అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతుంది.

ఆ కటౌట్‌ చూసి అన్ని నమ్మేయాలి డూడ్‌..! అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. పుట్టినరోజు శుభాకాంక్షలు డార్లింగ్‌ ప్రభాస్‌.  ప్రేమ, సంతోషం, గొప్ప కీర్తి ఎల్లప్పుడు మీ వెంటే ఉంటాయని కోరుకుంటున్నాను..! ఈ అద్భుతమైన సంవత్సరం మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది.. - చిరంజీవి

భారతీయ సినిమా పవర్‌హౌస్, నా సోదరుడు ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రభాస్ తన అసమానమైన ప్రతిభ, అంకితభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హృదయాలతో పాటు వెండితెరలపై జయిస్తూనే ఉన్నాడు. మరెన్నో సంవత్సరాల పాటు తన గొప్పతనం నిలిచిపోతుంది. హ్యాపీ బర్త్ డే ప్రభాస్.. -మంచు విష్ణు

నిబద్ధత, కోరిక, ప్రతిభ, సంసిద్ధత, కఠోర శ్రమ, వినయం అన్నీ కలిస్తేనే గెలుపు ఖాయం . నువ్వే విజేత. జన్మదిన శుభాకాంక్షలు ప్రభాస్.. - త్రివిక్రమ్‌

నా ప్రియమైన మిత్రుడు ప్రభాస్‌కి జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని  కోరుకుంటున్నాను.. - రామ్‌ చరణ్‌

అందరికి ప్రియమైన ప్రభాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ వినయం, నిబద్ధత,అంకితభావం ఇవన్నీ నేడు మిమ్మల్ని ఇంతటి స్థాయిలో ఉంచాయి.  మీరు కేవలం నటుడిగానే కాకుండా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే శక్తిగా మారారు. బాక్సాఫీస్‌ వద్ద మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా.. - ప్రశాంత్‌ వర్మ

Advertisement
 
Advertisement
Advertisement