
ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ (Chhatrapati Sambhaji Maharaj) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఛావా (Chhaava Movie). బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ శంభాజీగా, ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక మందన్నా నటించారు. విక్కీ కౌశల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రష్మిక పాత్రపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొందరు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.
రష్మిక కళ్లతోనే నటించగలదు
ఈ ట్రోలింగ్‌పై నటి దివ్య దత్త (Divya Dutta) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమె ఛావా చిత్రంలో రాజమాత సోయరబాయిగా నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దివ్య మాట్లాడుతూ.. సినిమాలో రష్మిక మందన్నా(Rashmika Mandanna)కు, నాకు మధ్య ఎలాంటి సన్నివేశాలు లేవు. కానీ తను గొప్ప నటి అని నా విశ్వాసం. కొన్ని సీన్స్‌లో తన కళ్లను చూడండి.. అవి మిమ్మల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఆమె ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ఇచ్చిందన్న విషయం మర్చిపోవద్దు.
ట్రాక్ రికార్డ్ చూశారా?
ప్రేక్షకుల కోసం ఆమె ఎంతలా తపన పడుతుందో ఆమె ట్రాక్ రికార్డ్ చూస్తే స్పష్టంగా తెలిసిపోతుంది. నాకు తెలిసిందల్లా రష్మిక మంచి అమ్మాయి మాత్రమే కాదు, ఎంతో కష్టపడే వ్యక్తి. ఆమె అంటే నాకెంతో ఇష్టం. మిగతావాళ్లేమనుకుంటారో నాకనవసరం. ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుంది. నీ పాత్ర నిడివి ఇంకాస్త ఎక్కువుంటే బాగుండేదని కొందరు అద్భుతంగా యాక్ట్ చేశావని మరికొందరు చెప్తుంటారు. నేనైనా, రష్మిక అయినా మా పాత్రల కోసం బెస్ట్ ఇచ్చాం.
అందుకు సంతోషిద్దాం..
మిగతావాళ్లు కూడా వారి పాత్రల పరిధి మేర నటించారు. ఇప్పుడు ప్రేక్షకులు వారి పని నిర్వర్తిస్తున్నారు. సినిమాను ఆదరిస్తున్నారు. ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలబెడుతున్నారు. అందుకు మనం సంతోషిద్దాం అని పేర్కొంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదలకాగా ఇప్పటివరకు రూ.300 కోట్లు రాబట్టింది. రష్మిక.. యానిమల్, పుష్ప 2తో వరుసగా భారీ విజయాల్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం ఈ బ్యూటీ సికందర్, ద గర్ల్‌ఫ్రెండ్, కుబేర, థామ సినిమాలు చేస్తోంది.
చదవండి: ఆ ఒక్క పనితో లాభపడ్డ ఇద్దరు హీరోలు.. లేకుంటే సీన్ రివర్స్?!