Fraud Case Filed against Shilpa Shetty and her Mom Sunanda - Sakshi
Sakshi News home page

శిల్పాశెట్టి, ఆమె తల్లి సునందపై చీటింగ్‌ కేసు

Aug 10 2021 7:47 AM | Updated on Aug 10 2021 1:20 PM

Cheating Case Filed On Shilpa Shetty And Her Mother Sunanda In Lucknow - Sakshi

Shilpa Shetty: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా శిల్పాశెట్టి, ఆమె తల్లి సునందపై లక్నోలోని రెండు పోలీసు స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. శిల్పా, ఆమె తల్లి తమ వద్ద కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరూ హజరత్‌గంజ్‌, విభూతిఖండ్‌ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు బృందాలుగా ఎర్పడి విచారణ చేపట్టారు. ఈ రెండు బృందాలకు డీసీపీ సంజీవ్‌ సుమన్‌ అధికారిగా ఉన్నారు. ఇప్పటికే శిల్పాను, ఆమె తల్లిని విచారించేందుకు డీసీపీ, ఒక బృందం ముంబై చేరుకుంది.  

పోలీసుల సమాచారం ప్రకారం.. శిల్పాశెట్టి అయోసిస్‌ వెల్‌నెస్‌ అండ్‌ స్పా పేరుతో ఫిటినెస్‌ సెంటర్‌ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఆమె చైర్మన్‌గా ఉండగా, ఆమె తల్లి సునంద డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఫిట్‌నెస్‌ సెంటర్‌ మరో బ్రాంచ్‌ను లక్నోలో ప్రారంభించేందుకు జ్యోత్స్న చౌహాన్‌, రోహిత్‌ వీర్‌ సింగ్‌ అనే ఇద్దరికి వారు ఫ్రాంచెజ్‌ ఇచ్చి, సెంటర్‌ను ప్రారంభించేందుకు వారి నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత దీనిపై వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శిల్పా, ఆమె తల్లి సునందలు తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం​ చేశారంటూ పోలీసులను ఆశ్రయించారు. డీసీసీ సంజీవ్‌ సుమన్‌ మాట్లాడుతూ.. ఈ విషయం ఉన్నత స్థాయికి చేరిందని, అందువల్ల పోలీసులు అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement