క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న 'చీటర్'.. ఆసక్తిగా పెంచుతోన్న ట్రైలర్! | Cheater Telugu Movie Trailer Released Today | Sakshi
Sakshi News home page

Cheater: క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న 'చీటర్'.. రిలీజ్ ఎప్పుడంటే?

Sep 17 2023 9:25 PM | Updated on Sep 17 2023 9:26 PM

Cheater Telugu Movie Trailer Released Today - Sakshi

రేఖ నిరోషా, చంద్రకాంత్ దత్త, నరేందర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం "చీటర్". ఈ సినిమాను బర్ల  నారాయణ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.  యస్ఆర్ఆర్ ప్రొడక్షన్ పతాకoపై పరుపాటి శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో వినాయకచవితి సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.  

(ఇది చదవండి: 'నా అనుమతి లేకుండా తాకాడు'..లైంగిక వేధింపులపై హీరోయిన్!)

ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. "మేము అనుకున్నట్లుగానే సినిమా వచ్చింది. మా డైరెక్టర్ అనుకున్న దానికంటే బాగా కష్టపడ్డారు. మంచి అవుట్ పుట్ వచ్చింది. ప్రేక్షకులకు కథ తప్పకుండా నచ్చుతుంది. మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ అదరిస్తారు అని నమ్మకం ఉంది'. అని అన్నారు. డైరెక్టర్ నారాయణ మాట్లాడుతూ.. 'సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా మా సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు పక్కా నచ్చుతుంది. మా సినిమాని థియేటర్‌లో చూసి ఆదరించండి.' అని అన్నారు. ఈ చిత్రంలో రాధిక, అనిత,మల్లేశం, నిషాన్, గౌటి రాజు కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement