చిన్నారులపై అసభ్యకర సన్నివేశాలు, ప్రముఖ దర్శకుడిపై కేసు | Case Filed On Director Mahesh Manjrekar Over Obscene Scenes On Childrens | Sakshi
Sakshi News home page

Mahesh Manjrekar: చిన్నారులపై అసభ్యకర సన్నివేశాలు, ప్రముఖ దర్శకుడిపై కేసు

Feb 25 2022 2:58 PM | Updated on Feb 25 2022 5:02 PM

Case Filed On Director Mahesh Manjrekar Over Obscene Scenes On Childrens - Sakshi

బాలీవుడ్‌ ప్రుముఖ డైరెక్టర్‌, నటుడు మహేశ్‌ మంజ్రేకర్‌పై కేసు నమోదైంది. మైనర్‌ పిల్లలపై  అభ్యంతకర సన్నివేశాలను తెరకెక్కించారనే ఆరోపణలపై ముంబై మహిమ్‌ పోలీసు స్టేషన్‌లో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. దీంతో డైరెక్టర్‌ మహేశ్‌ మంజ్రేకర్‌పై కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. వివరాలు.. ఇటీవల మహేశ్‌ మంజ్రేకర్‌ రూపొందించిన మరాఠి చిత్రంలో చిన్నారులపై అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయి.

చదవండి: ఛీఛీ ఇలాంటి చెత్త వీడియోలో నటించడమేంటి, కాస్తా చూసుకో: కీర్తిపై దారుణమైన ట్రోల్స్‌

ఈ సీన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మహరాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త సీమ దేశ్‌పాండే ముంబై సెషన్స్‌ కోర్టులో పటిషన్‌ దాఖలు చేసింది. ఇందులో నటించిన పిల్లలంతా మైనర్లని, అలాంటి వారితో అభ్యంతకర దృశ్యాలను చిత్రీకరించడం పోక్స్‌ చట్టాన్ని ఉల్లంఘించమేనని ఆమె పిటిషన్‌లో ఆరోపించారు. సీమ దేశ్‌పాండే ఫిర్యాదు మేరకు మహేశ్‌ మంజ్రేకర్‌పై ఐపీసీ 292, 34 సెక్ష‌న్ల‌తో పాటు పోక్సో సెక్ష‌న్ 14, ఐటీ యాక్ట్ 67, 67బీ కింద కేసు న‌మోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కేసులో ఎవ‌రిని అరెస్టు చేయ‌లేదని సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement