Captain Miller: నెల రోజుల్లోపే ఓటీటీకి 'కెప్టెన్ మిల్లర్‌'.. ఆ రోజు నుంచేనా?

Captain Miller was released In Ott Platform On This Date Goes Viral - Sakshi

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుశ్ నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచింది. తమిళంలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కోలీవుడ్‌ పొంగల్‌ బరిలో నిలిచి హిట్‌ను సొంతం చేసుకుంది. అయితే తెలుగులో ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. రిలీజ్ ఆలస్యం కావడంతో పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ‌్ కాగా...కేవ‌లం రూ.కోటి వ‌ర‌కు మాత్ర‌మే వ‌సూళ్లు రాబట్టింది.

తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌పై నెట్టింట చర్చ నడుస్తోంది. జవనరి 12న థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం నెల రోజుల్లోనే ఓటీటీ రానుందని టాక్ వినిపిస్తోంది. ఈనెల 9 నుంచే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం. ఈ విషయంపై త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఓటీటీలో మాత్రం తెలుగు, తమిళంలో ఓకేసారి స్ట్రీమింగ్‌కు రానుందని టాక్. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, కన్నడ స్టార్‌ శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించారు. అరుణ్ మాతీశ్వరన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీకి.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. 

కథేంటంటే..
ఈ సినిమా కథంతా స్వాతంత్రానికి పూర్వం అంటే 1930లో సాగుతుంది. తమిళనాడులోని ఓ చిన్న గ్రామానికి చెందిన అగ్ని అలియాస్‌ అగ్నీశ్వర(ధనుష్‌) సొంత ఊరిలోనే కుల వివక్షకు గురవుతాడు.త‌క్కువ కులానికి చెందిన వార‌నే సాకుతో ఆ ఊరి వాళ్లని గుడిలోకి రానివ్వడు అక్కడి రాజు(జయప్రకాష్‌). ఆ కోపంతో అగ్ని బ్రిటీష్‌ సైన్యంలో చేరతాడు. అక్కడ ట్రైనింగ్‌ పూర్తయ్యాక అతనికి మిల్లర్‌ అనే పేరుపెట్టి విధుల్లోకి పంపుతారు. ఫస్ట్‌ డ్యూటీలోనే తన పై అధికారిని చంపేస్తాడు. అనంతరం తోటి సైనికుడు రఫీక్‌(సందీప్‌ కిషన్‌) సహాయంతో అక్కడ నుంచి పారిపోయి దొంగగా మారుతాడు.

రాజన్న(ఎలగో కుమారవేల్‌) ముఠాతో కలిసి దొంగతనాలు చేస్తూ..వచ్చిన డబ్బులో కొంచెం స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న సంఘాలకు పంపుతుంటారు. ఓ సారి తన ఊరిలోని గుడిలో  రహస్యంగా దాచిపెట్టిన విలువైన ఓ పెట్టెను బ్రిటీష్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. వారి నుంచి ఆ పెట్టెను మిల్లర్‌ దొంగిలిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ పెట్టెను మిల్లర్‌ ఎందుకు దొంగిలించాల్సి వచ్చింది? అందులో ఏం ఉంది? తన ఊరి ప్రజలపై దండయాత్రకు వచ్చిన బ్రిటీష్‌ సైన్యాన్ని కెప్టెన్‌ మిల్లర్‌ ఎలా తిప్పికొట్టాడు? ఈ కథలో భానుమతి(ప్రియాంక అరుల్‌ మోహన్‌), శివన్న(శివరాజ్‌కుమార్‌)ల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

whatsapp channel

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top