దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. ఆ రోజే రానా తమ్ముడి వివాహం! | Buzz: Daggubati Abhiram Wedding Venue And Date - Sakshi
Sakshi News home page

Daggubati Abhiram: ఓ ఇంటివాడు కాబోతున్న యంగ్‌ హీరో.. పెళ్లికూతురు ఎవరో తెలుసా?

Sep 9 2023 2:42 PM | Updated on Sep 9 2023 3:22 PM

Buzz: Daggubati Abhiram Wedding Venue and Date - Sakshi

అభిరామ్‌, ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒకరికొకరు ఇష్టపడుతున్నారని, వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపాయని సమాచారం. దివంగత రామానాయుడు కోరిక కూడా ఇ

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌ బాబు ఇంట పెళ్లిసందడి షురూ కానుంది. సురేశ్‌ బాబు రెండో తనయుడు, హీరో అభిరామ్‌ పెళ్లి ఖరారైనట్లు తెలుస్తోంది. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరనుకుంటున్నారా? వాళ్ల బంధువులమ్మాయే! దివంగత నిర్మాత రామానాయుడి తమ్ముడి మనవరాలినే అభిరామ్‌ పెళ్లాడబోతున్నాడట! అంటే సురేశ్‌బాబు చెల్లెలి కూతురితోనే అభిరామ్‌ జీవితాన్ని పంచుకోనున్నాడన్నమాట! ఆమె కుటుంబం కారంచేడులో ఉంటోంది.

రామానాయుడు కోరిక కూడా ఇదే!
అభిరామ్‌, ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒకరికొకరు ఇష్టపడుతున్నారని, వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపాయని సమాచారం. దివంగత రామానాయుడు కోరిక కూడా ఇదేనని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అభిరామ్‌ పెళ్లి ఇండియాలో జరగడం లేదట! శ్రీలంకలో గ్రాండ్‌గా, స్పెషల్‌గా పెళ్లి చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు వినికిడి. డిసెంబర్‌ 6న ఈ పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఇందుకోసం శుభలేఖలు కూడా వినూత్నంగా డిజైన్‌ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కారంచేడులో రామానాయుడు ఉన్న పాత ఇల్లు డిజైన్‌ను శుభలేఖల మీద అచ్చువేయిస్తున్నారట.

ఆ పనిలో ఉన్న అభిరామ్‌
ఇకపోతే దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ అహింస. ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర రాణించలేకపోయింది. ప్రస్తుతం అభిరామ్‌ ఒక కాఫీ షాపును ఓపెన్‌ చేసే పనిలో ఉన్నాడు. రామానాయుడు స్టూడియో పక్కనే రైటర్స్‌ కాఫీ షాప్‌ పేరిట షాపు ఓపెన్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అభిరామ్‌ అన్నయ్య రానా పెళ్లి 2020లో  మిహికా బజాజ్‌తో జరిగింది. ఇప్పుడు అభిరామ్‌ కూడా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతుండటంతో అభిమానులు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

చదవండి: టైం ట్రావెల్‌ మూవీ.. రెండు నెలలు ఆలస్యంగా ఓటీటీలోకి!

Advertisement
 
Advertisement
Advertisement