ఓటీటీలో డిటెక్టివ్‌ క్రైమ్ థ్రిల్లర్‌ సినిమా స్ట్రీమింగ్‌ | The Buckingham Murders Movie OTT Streaming Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో డిటెక్టివ్‌ క్రైమ్ థ్రిల్లర్‌ సినిమా స్ట్రీమింగ్‌

Oct 29 2024 12:25 PM | Updated on Oct 29 2024 12:33 PM

The Buckingham Murders Movie OTT Streaming Date Locked

బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘ది బకింగ్‌హమ్‌ మర్డర్స్‌’ ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. హన్సల్‌ మెహతా దర్శకత్వం వహంచిన ఈ చిత్రం సెప్టెంబరు 13న రిలీజ్‌ అయింది. '1992 స్కామ్' వంటి వెబ్‌ సిరీస్‌తో దర్శకుడు తన మార్క్ చూపించిన హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. అయితే, ఊహించినంతగా బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా మెప్పించలేదు.

బ్రిటిష్‌– ఇండియన్‌ డిటెక్టివ్‌ జస్మిత్‌ భామ్రా పాత్రలో కరీనా మెప్పించింది. క్రైమ్ థ్రిల్లర్‌గా పాజిటివ్‌ టాక్‌ వచ్చినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. నవంబర్‌ 8న స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే ప్రస్తుతం అందుబాటులోకి రానుంది. తెలుగు వర్షన్‌ గురించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

ది బకింగ్‌హామ్ మర్డర్స్ రన్‌టైమ్‌ కేవలం 90 నిమిషాలు మాత్రమే ఉంటుంది. రూ. 50 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ. 15 కోట్లు మాత్రమే రాబట్టింది.  క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీస్‌ను ఇష్టపడే ప్రేక్షకులు మాత్రం ఓటీటీలో తప్పకుండా ఈ మూవీని ఇష్టపడుతారని చెప్పవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement