
మధు దామరాజు, బ్రహ్మాజీ, యశ్వంత్, నిహారిక
బ్రహ్మాజీ, యశ్వంత్ పెండ్యాల ప్రధానపాత్రల్లో ‘కథకళి’ అనే సినిమా షురూ అయింది. ప్రసన్న కుమార్ నాని దర్శకత్వంలో రవికిరణ్ కలిదిండి నిర్మిస్తున్న ఈ చిత్రం శనివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హర్షిత్ రెడ్డి కెమేరా స్విచ్చాన్ చేయగా, నిహారిక కొణిదెల క్లాప్ ఇచ్చారు. ఫస్ట్ షాట్‌కి డైరెక్టర్ ప్రసన్నకుమార్ నాని దర్శకత్వం వహించగా, బ్రహ్మాజీ స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు.
అనంతరం ప్రసన్న కుమార్ నాని మాట్లాడుతూ– ‘‘ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌గా ‘కథకళి’ ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో కథే హీరో’’ అన్నారు బ్రహ్మాజీ. ‘‘బ్రహ్మాజీగారు ఈ చిత్రంలో ముఖ్యమైనపాత్ర చేస్తున్నారు. మంచి టీమ్‌తో కలిసి ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు రవికిరణ్ కలిదిండి. ‘‘ఈ సినిమాలో హీరో లంటూ ఎవరూ ఉండరు. కథను నడిపించేపాత్రలు ఉంటాయి’’ అని యశ్వంత్ పెండ్యాల చెప్పారు. మధు దామరాజు, మైమ్ మధు కీలకపాత్రలుపోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పవన్, కెమేరా: జితిన్ మోహన్.