Kathakali movie
-
క్రైమ్ థ్రిల్లర్ షురూ
బ్రహ్మాజీ, యశ్వంత్ పెండ్యాల ప్రధానపాత్రల్లో ‘కథకళి’ అనే సినిమా షురూ అయింది. ప్రసన్న కుమార్ నాని దర్శకత్వంలో రవికిరణ్ కలిదిండి నిర్మిస్తున్న ఈ చిత్రం శనివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హర్షిత్ రెడ్డి కెమేరా స్విచ్చాన్ చేయగా, నిహారిక కొణిదెల క్లాప్ ఇచ్చారు. ఫస్ట్ షాట్‌కి డైరెక్టర్ ప్రసన్నకుమార్ నాని దర్శకత్వం వహించగా, బ్రహ్మాజీ స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు.అనంతరం ప్రసన్న కుమార్ నాని మాట్లాడుతూ– ‘‘ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌గా ‘కథకళి’ ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో కథే హీరో’’ అన్నారు బ్రహ్మాజీ. ‘‘బ్రహ్మాజీగారు ఈ చిత్రంలో ముఖ్యమైనపాత్ర చేస్తున్నారు. మంచి టీమ్‌తో కలిసి ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు రవికిరణ్ కలిదిండి. ‘‘ఈ సినిమాలో హీరో లంటూ ఎవరూ ఉండరు. కథను నడిపించేపాత్రలు ఉంటాయి’’ అని యశ్వంత్ పెండ్యాల చెప్పారు. మధు దామరాజు, మైమ్ మధు కీలకపాత్రలుపోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పవన్, కెమేరా: జితిన్ మోహన్. -
విశాల్‌తో కథాకళి
నటుడు విశాల్‌తో కథాకళి ఆడేస్తోంది నటి క్యాథరిన్ ట్రెసా. తొలుత టాలీవుడ్లో పైసా చిత్రంతో నటిగా ఖాతాను ఓపెన్ చేసిన ఈ మాలీవుడ్ బ్యూటీ ఆ చిత్రం పూర్తిగా నిరాశ పరచడంతో కోలీవుడ్‌పై దృష్టి సారించింది. ఇక్కడ కార్తీతో మెడ్రాస్ చిత్రంలో రొమాన్స్ చేసే అవకాశం దక్కింది. దీంతో ఆమె పాపులర్ అయ్యింది. తెలుగులో అల్లుఅర్జున్‌తో ఇద్దరమ్మాయిల్లో ఒకరిగా నటించి అక్కడా గుర్తింపు పొందింది. ప్రస్తుతం తమిళంలో కణిదన్ చిత్రాన్ని పూర్తిచేసి విశాల్‌తో కథాకళి చిత్రంలో నటిస్తోంది. తెలుగులోనూ అల్లుఅర్జున్‌తో రెండోసారి నటిస్తున్న క్యాథరిన్ ట్రెసా తాజాగా గ్లామర్ విషయంలో తన పంథాను మార్చుకుందట. మెడ్రాస్ చిత్రంలో చక్కని కుటుంబ కాథా పాత్రతో అలరించింది. అలాంటిది ఇటీవల విడుదలయిన రుద్రమదేవి చిత్రంలో ఒక పాటలో మెరిచి తన అందాలను రుచిని శాంపిల్‌గా చూపించిన ఈ కేరళాకుట్టి స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించే విధంగా ఇకపై అందాలారబోతలో మరింత రెచ్చిపోవాలని నిర్ణయించుకుందట. అది విశాల్‌తో నటిస్తున్న కథాకళితోనే ప్రారంభించిందట. కేరళాలో బహుళ ప్రాచుర్యం పొందిన నృత్యం కథాకళితో పాటు కూచిపూడి నృత్యంలోనూ ప్రావీణ్యం సంపాదించిన ఈ మలయాళీ భామకు కథాకళి చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్ర అట. ఇందులో గ్లామర్‌తో పాటు ఒక పాటలో కథాకళి నృత్యంలో దుమ్ములేపిందని సమాచారం. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలోనే చిత్ర ఫస్ట్‌లుక్ ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కథాకళి చిత్రం తన కేరీర్‌కు మంచి హెల్ప్ అవుతుందనే ఆశతో క్యాథరిన్ ట్రెసా ఎదురు చూస్తోందట.