విశాల్‌తో కథాకళి | Vishal team up with Catherine Tresa! | Sakshi
Sakshi News home page

విశాల్‌తో కథాకళి

Oct 31 2015 2:01 AM | Updated on Apr 3 2019 9:05 PM

విశాల్‌తో కథాకళి - Sakshi

విశాల్‌తో కథాకళి

నటుడు విశాల్‌తో కథాకళి ఆడేస్తోంది నటి క్యాథరిన్ ట్రెసా. తొలుత టాలీవుడ్‌లో పైసా చిత్రంతో నటిగా ఖాతాను ఓపెన్ చేసిన...

నటుడు విశాల్‌తో కథాకళి ఆడేస్తోంది నటి క్యాథరిన్ ట్రెసా. తొలుత టాలీవుడ్‌లో పైసా చిత్రంతో నటిగా ఖాతాను ఓపెన్ చేసిన ఈ మాలీవుడ్ బ్యూటీ ఆ చిత్రం పూర్తిగా నిరాశ పరచడంతో కోలీవుడ్‌పై దృష్టి సారించింది. ఇక్కడ కార్తీతో మెడ్రాస్ చిత్రంలో రొమాన్స్ చేసే అవకాశం దక్కింది. దీంతో ఆమె పాపులర్ అయ్యింది. తెలుగులో అల్లుఅర్జున్‌తో ఇద్దరమ్మాయిల్లో ఒకరిగా నటించి అక్కడా గుర్తింపు పొందింది. ప్రస్తుతం తమిళంలో కణిదన్ చిత్రాన్ని పూర్తిచేసి విశాల్‌తో కథాకళి చిత్రంలో నటిస్తోంది.

తెలుగులోనూ అల్లుఅర్జున్‌తో రెండోసారి నటిస్తున్న క్యాథరిన్ ట్రెసా తాజాగా గ్లామర్ విషయంలో తన పంథాను మార్చుకుందట. మెడ్రాస్ చిత్రంలో చక్కని కుటుంబ కాథా పాత్రతో అలరించింది. అలాంటిది ఇటీవల విడుదలయిన రుద్రమదేవి చిత్రంలో ఒక పాటలో మెరిచి తన అందాలను రుచిని శాంపిల్‌గా చూపించిన ఈ కేరళాకుట్టి స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించే విధంగా ఇకపై అందాలారబోతలో మరింత రెచ్చిపోవాలని నిర్ణయించుకుందట.

అది విశాల్‌తో నటిస్తున్న కథాకళితోనే ప్రారంభించిందట. కేరళాలో బహుళ ప్రాచుర్యం పొందిన నృత్యం కథాకళితో పాటు కూచిపూడి నృత్యంలోనూ ప్రావీణ్యం సంపాదించిన ఈ మలయాళీ భామకు కథాకళి చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్ర అట. ఇందులో గ్లామర్‌తో పాటు ఒక పాటలో కథాకళి నృత్యంలో దుమ్ములేపిందని సమాచారం.

పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలోనే చిత్ర ఫస్ట్‌లుక్ ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కథాకళి చిత్రం తన కేరీర్‌కు మంచి హెల్ప్ అవుతుందనే ఆశతో క్యాథరిన్ ట్రెసా ఎదురు చూస్తోందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement