బతకడానికి కేవలం 30 శాతమే ఛాన్స్: స్టార్ హీరోయిన్ | Sonali Bendre Shares Horrific Moment In Her Life | Sakshi
Sakshi News home page

Sonali Bendre: 'చివరి స్టేజీలో ఉన్నా.. నా భర్త ముఖం మాడిపోయింది'

May 9 2024 1:36 PM | Updated on May 9 2024 2:07 PM

Sonali Bendre Shares Horrific Moment In Her Life

మురారి, ఇంద్ర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. టాలీవుడ్‌లో హిట్‌ చిత్రాలు చేసిన బాలీవుడ్ భామ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే 2018లో క్యాన్సర్ ‍బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2 వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనాలి క్యాన్సర్‌ నిర్ధారణ తర్వాత తన కుటుంబం తీవ్రమైన ఒత్తిడికి గురైందని తెలిపింది.

సోనాలి మాట్లాడుతూ.. 'ముఖ్యంగా 2018లో క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆ వార్త నా కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మాకు షాకింగ్‌గా  అనిపించింది. ఇది జరిగినప్పుడు నేను రియాల్టీ షో చేస్తున్నా. ఆ సమయంలో నాకు ఆరోగ్యం సరిగ్గా లేదని తెలుసు. డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లమ్‌ మాత్రమే ఉంటుందని అనుకున్నా. కానీ పరీక్షలు చేశాక అసలు విషయం తెలిసింది.

 ఆ సమయంలో డాక్టర్, నా భర్త గోల్డీ బెహ్ల్ మొహాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటికే స్టేజ్ -4 క్యాన్సర్‌తో ఉన్నట్లు తెలిసింది. కేవలం 30 శాతం బతికే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. దీంతో డాక్టర్‌పై నా భర్త కోపం ప్రదర్శించాడు. కానీ ఆ తర్వాత కీమోథెరపీ చేయించుకున్నా. అది చాలా కఠినమైన చికిత్స. నా జుట్టు రాలడం లాంటి తీవ్రమైన సమస్య ఎదుర్కొన్నా' అని తెలిపింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement