వాళ్లిద్దరినీ ఇష్టమొచ్చినట్లు వాడుకుంటున్నావ్‌.. సోనియాపై యష్మి ఫైర్‌ | Bigg Boss Telugu 8 Day 23 Promo | Sakshi
Sakshi News home page

వాళ్లిద్దరినీ ఇష్టమొచ్చినట్లు వాడుకుంటున్నావ్‌.. సోనియాపై యష్మి ఫైర్‌

Sep 24 2024 12:20 PM | Updated on Sep 24 2024 12:23 PM

Bigg Boss Telugu 8 Day 23 Promo

బిగ్‌బాస్‌ హోస్‌లో చీఫ్‌ పోస్ట్‌ పోయాక యష్మి ఆటలో కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. నామినేషన్స్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత మంగళవారం (సెప్టెంబర్‌ 24) ఎపిసోడ్‌కు సంబంధించి ఒక ప్రోమో వచ్చింది. అందులో యష్మి, సోనియాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈవారం నామినేషన్ల తంతు రచ్చరచ్చ అయింది. ఒకరిపై మరోకరు తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకున్నారు. ముఖ్యంగా సోనియా, నబీల్ మధ్య మాటల యుద్ధం భారీగానే జరిగింది. ఈ గొడవలు ఇంతటితో క్లోజ్‌ అయ్యాయి అనుకుంటే.. మంగళవారం ఎపిసోడ​్‌లో కూడా ఆ రచ్చ కొనసాగినట్లు ఉంది.

సోనియాను యష్మి  నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత వారిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. సిస్టర్‌, మదర్‌ అంటూ రిలేషన్స్‌ కలుపుతూ సోనియా గేమ్‌ ఆడుతుందని యష్మి ఫైర్‌ అయింది. ఎవరిని ఎలా వాడుకోవాలో నీకు బాగా తెలుసంటూ సోనియాపై మండిపడింది. టాస్క్‌లలో పృథ్వి, నిఖిల్‍ ఇద్దరూ సోనియాకు హెల్ప్ చేస్తున్నారనేలా యష్మి మాట్లాడింది. దీంతో సోనియా కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది. తాజాగా విడుదలైన ప్రోమోను చూస్తే మంగళవారం ఎపిసోడ్‌ రసవత్తరంగా ఉండేలా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement